
అందుకే తైవాన్ అధ్యక్షురాలు తమ ప్రజలకు ఇంగ్లీష్ నేర్పడానికి ప్రణాళిక తయారు చేసింది. వచ్చే ఏడేళ్ల కాలంలో తైవాన్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ ను ప్లూయెన్స్ గా మాట్లాడాలి. దీని కోసం ఒక బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడటం లేదు. ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుని, అనర్గళంగా మాట్లాడటమే లక్ష్యంగా బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇంగ్లీష్ మాట్లాడటం ద్వారా అమెరికా,యూరప్ లాంటి దేశాలతో వ్యాపారం చేయొచ్చు. తద్వారా చైనా మీద ఆధారపడటం తగ్గుతుంది. టూరిజం బాగుపడాలన్నా, బిజినెస్ రంగం డెవలప్ కావాలన్న ఇంగ్లీష్ తప్పనిసరి అని తైవాన్ ప్రభుత్వం భావిస్తోంది.
తైవాన్ లో ప్రస్తుతం 829 బిలియన్ డాలర్ల వ్యాపారం ప్రస్తుతం జరుగుతోంది. హైటెక్ హర్డ్ వేర్ వ్యాపారం అమెరికాతో చేస్తోంది. చైనా ఆధీనంలో ఉన్న హంకాంగ్ కానీ, ఇండియా, పిలిప్పీన్స్, సింగపూర్ లాంటి దేశాల్లో వ్యాపారాలు సాగడానికి కారణం ఇంగ్లీష్. ప్రపంచ భాషగా ఇంగ్లీష్ మారిన తర్వాత వ్యాపార, వాణిజ్య సంబంధాలు, పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంగ్ల భాష ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి తైవాన్ ప్రజలకు ఎలాగైనా ఇంగ్లీష్ ను నేర్పించాలనే పట్టుదలతో ఆ దేశ అధ్యక్షురాలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నిర్ణయంతో తైవాన్ తలరాత మారుతుందా లేదా చూడాలంటే ఏడేళ్లు ఆగాల్సిందే.