ఒక్కోసారి ఆకస్మిక తనికీలలో బయటపడ్డ విషయాలను చూస్తే, పెద్ద మొత్తాల్లో జీతాలు తీసుకుంటూ ప్రభుత్వం తరఫున ప్రజలకు సేవ చేయడానికి వినియోగించబడిన కొంతమంది అధికారుల నిర్వాకం బయటపడుతూ ఉంటుంది. తనిఖీ చేయడానికి వచ్చిన పై అధికారులు అయితే ఇలా దొరికిన వాళ్ళ పనితీరును చూసి వారిపై ఆశ్చర్యంతో కూడిన ఆగ్రహావేశాలతో మండిపడడం జరుగుతుంది.


విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వాళ్లతో మాట్లాడిన సందర్భంగా, మూడో తరగతి విద్యార్థి ఆంగ్ల వర్కు బుక్ వ్రాయకపోగా, మరోచోట ఐదో తరగతి విద్యార్థి గణితం వర్క్ బుక్ పూర్తిగా పూరించకపోవడంతో  అసహనం వ్యక్తం చేశారు. చివర్లో ఏదో ఒక చాప్టర్ మిగిలిందంటే అర్థం చేసుకోవచ్చని, కానీ ఒక్క పేజీ కూడా పూర్తి చేయించకపోతే అసలు మీరంతా ఏం చేస్తున్నారని అధికారులు నిలదీశారు.


సచివాలయంలో కూర్చుని మీరు ఏదో చేసేస్తారని మేము ఆలోచిస్తుంటే, మా ఆలోచనలకు మీ ఆచరణకు చాలా వ్యత్యాసం కనిపిస్తుందని 15000ఫీజు తీసుకుంటూ ప్రైవేట్ పాఠశాలల్లో బ్రహ్మాండంగా బోధిస్తుంటే, అంతకు ఐదు రేట్లు 75000జీతం తీసుకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధిస్తున్నది ఏంటి? డబ్బులు ఊరకే రావట్లేదు, అవి ప్రజలు ఇచ్చే పన్నుల నుండి వస్తున్నాయని గుర్తించాలని అన్నారు.


టెక్కలి ఉప విద్యాశాఖ అధికారి పరిణయమ్మ డీఈవోగా ఆరు నెలలు టైం పాస్ చేశారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ప్రగతి నివేదికలు అల్మరాలో పెట్టుకుంటున్నారు, ఇకపై వాటిని తల్లిదండ్రులకు ఇచ్చి వాటిని వాట్సాప్ లో మాకు ఫోటో పెట్టాలి. పాఠశాలల్లో 500 మంది పిల్లలు చదువుతుంటే ఐదుగురు పిల్లలు ఇంకా తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పలేని పరిస్థితుల్లో హెచ్ఎంలు ఉన్నారని, పనిచేయని వారిపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ఎందుకని, ఆర్జెడి జ్యోతి కుమారి, డిఇఓ తిరుమల చైతన్య తీరుపై ప్రవీణ్ ప్రకాష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఆయన చేసిందేదో తప్పు అన్నట్టు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ చర్యలను ఖండిస్తూ, ఆయనపై ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: