
చాలామంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. మొదట్లో అయితే వ్యాక్సిన్స్ వేయించుకోవడానికి నిరాకరించారు. బలవంతంగా చేయాల్సి వస్తుందా అనుకుంటుంటే అలా బలవంతంగా వేయడానికి వీలులేదని కోర్టుల వరకూ కూడా వెళ్లారు. మతం అప్పుడు వ్యాక్సిన్ వేయించుకోకుండా అడ్డుపడింది వాళ్లకి. కానీ పాకిస్తాన్ లో ఇప్పుడు కూడా ఆ తత్వం ఉందని తెలుస్తుంది. మొన్న కరోనా టైం లో చైనా దగ్గర నుంచి కొనుక్కుని మరి వ్యాక్సిన్ వేయించుకున్నారు అయితే అప్పుడు లేని మతానికి వ్యతిరేకమైన వ్యాక్సిన్ ఇప్పుడు వచ్చిందట.
ప్రతి ఏడాది వేసేటువంటి పోలియో వ్యాక్సిన్ కు మేం బందోబస్తు చేయం, అది మత విరుద్ధమంటూ విచిత్రంగా అక్కడి పోలీసులు నిరాకరించారట. వ్యాక్సిన్ వేసుకోకండి, వేసుకుంటే అది ఇస్లాం మతానికి వ్యతిరేకం అంటూ తహరిన్ కి తాలిబన్ ఈ పాకిస్తాన్ వాళ్ళు పిలుపునిచ్చారట.
మత ప్రాతిపదికన దేశాన్ని ఏర్పాటు చేయాలనుకునే మత తీవ్రవాదులు ఆ పిలుపునిచ్చారట. ఆల్రెడీ అది మత దేశం అయితే అలాంటి దేశం ఇంకా మత మూఢత్వ దేశంగా కావాలని పిలుపునిస్తే, ఆ సందర్భంలో తెహరీన్ కి తాలిబాన్ ఈ పాకిస్తాన్ వాళ్ళు పిలుపునిచ్చినప్పుడు వ్యాక్సిన్లు వెయ్యకపోవడం మంచిది అని, ఆపేస్తే బెటర్ అని లేకపోతే వాళ్ళు వచ్చి మన మీద దాడి చేస్తారని అక్కడి పోలీసులు బందోబస్తు చేయడానికి ఒప్పుకోలేదని తెలుస్తుంది.