
కేవలం సమావేశాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. చైనా భారత్ ను ముందు వెళ్లాలని కోరుతున్నారు. భారత్ చైనా వెళ్లాలని కోరుతోంది. గాల్వాన్ లోయలో సెక్యూరిటీ పెంచడం వల్ల భారత్ కు ప్రతి రోజు రూ. 5 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. అయినా భారత్ ఎక్కడ కూడా ఈ విషయంలో తగ్గేది లేదని చెబుతోంది. ప్రస్తుతం జరిగిన సమావేశంలో భారత్ తన భూభాగాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్లదని జై శంకర్ తేల్చి చెప్పారు.
చైనా నే వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత్ ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు డ్రాగన్ కంట్రీ పన్నిన కుట్రగా మేధావులు అభిప్రాయపడుతున్నారు. డ్రాగన్ కంట్రీ తన కుయుక్తులతో ఇండియాకు రోజు రూ. 5 కోట్లకు పైగా ఖర్చయ్యేలా చేస్తోంది. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా దెబ్బతీయొచ్చని భావిస్తోంది. కానీ భారత్ భూభాగాన్ని అస్సలు వదులుకోవడానికి ఇష్ట పడటం లేదు. ఎంత ఖర్చయినా సరే.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే అస్సలు తగ్గేది లేదని అంటోంది.
ప్రత్యేకంగా సమావేశమైన సమయంలో కూడా జై శంకర్ చైనా విదేశాంగ మంత్రితో చర్చలు జరిపి కుండ బద్దలు కొట్టారు. ముందు చైనా బలగాలే గాల్వాన్ లోయలో వెనక్కి వెళ్లాలని చెప్పారు.