
అదే సమయంలో రష్యన్ ఆర్మీ మాత్రం పోరాటంల విజయం సాధించామని గొప్పలు చెప్పుకుంటోంది. ఉక్రెయిన్ రివర్స్ ఎటాక్ లో క్రిమియాలో రైల్వే ట్రాక్ లను తగలబెట్టారు. 2014 లో క్రిమియాను రష్యా ఆక్రమించుకుంది. ఆ సమయంలో ఉక్రెయిన్ పోరాటం చేయలేదు. కానీ ప్రస్తుతం ఉక్రెయిన్ పోరాటం ఎక్కడి వరకు వెళుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. సరైన ఆయుధాలు లేవు. సైనికులు మరణిస్తున్నారు. తిండి దొరకడం లేదు. ఇలాంటి సమయంలో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి సైనికులు రష్యా పై పోరాటం కొనసాగిస్తున్నారు.
ఉక్రెయిన్ ఏకంగా రష్యాఅధ్యక్షుడు పుతిన్ ను చంపాలని నిర్ణయించుకుంది. క్రెమ్లిన్ లోని రష్యా అధ్యక్ష భవనంలో పుతిన్ ను చంపితే యుద్దం ఆగుతుందని భావించి ఎటాకింగ్ కు దిగింది. దీన్ని రష్యా పసిగట్టి ప్రమాదం జరగకుండా పుతిన్ ను కాపాడుకుంది. ఇది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేసిన పని అని గమనించి ఎలాగైన సరే అతడిని అంతమొందించాలని రష్యా నిర్ణయించుకుంది. దీంతో జెలెన్ స్కీ ప్రస్తుతం అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. క్రిమియా పై దాడిని రష్యా తీవ్రంగా ఖండిస్తోంది. మరో వైపు ఉక్రెయిన్ సైనికులు, రష్యా ఆర్మీ కి మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. ఇది ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.