బైడెన్ దెబ్బకి అమెరికా, సౌదీ అరేబియాల మధ్య రిలేషన్స్ కట్ అయిపోతున్నాయని తెలుస్తుంది. లేదంటే మొన్నటి వరకు అరబ్ కంట్రీల సెక్యూరిటీ అమెరికానే చూసేది. కానీ ఎప్పుడైతే బైడెన్ వెళ్లి సౌదీ అరేబియా రాజుని పరాయ అని కామెంట్ చేసి వచ్చాడో, అప్పటినుండి వీళ్ళ బంధాలు బలహీన పడిపోయాయి. దాంతో అది అమెరికాని పక్కన పెట్టి చైనా తో స్నేహాన్ని కొనసాగిస్తుందని తెలుస్తుంది.


సౌదీ అరేబియా దేశాలు ఇప్పుడు రష్యాతో ముందుకు వెళ్తున్నాయి. చైనాతో కొనసాగుతున్నాయి. అలాగే ఇరాన్ తో కూడా కలిసి సాగుతున్నాయి. అయితే వీటి మధ్యన ఆర్థిక బంధం బలపడితే అమెరికా యూరప్ దేశాల పని అయిపోతుందని తెలుస్తుంది. దాంతో భారత్ ను మధ్యలో పెట్టి ఆర్థిక బంధం కోసం అమెరికా ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. తాజాగా అమెరికా సౌదీ అరేబియా ఇంకా భారత్ కు సంబంధించిన మీటింగ్ లో ఆల్టర్నేటివ్ లైన్ గురించి ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు.


ఇప్పుడు చైనా బెల్ట్ అండ్ రోడ్డు ఇనిషియేటివ్ పేరుతో అన్ని దేశాల మధ్యన రవాణాని కలుపుతుంది. అయితే ఇప్పుడు దీనికి  ప్రత్యామ్నాయమైన రహదారి మార్గం  ఏర్పాటు చేయాలని భారత్ ని మధ్యలో పెడుతూ అమెరికా సూచించిందని తెలుస్తుంది. ఇప్పుడు రోడ్లు వేసే ఖర్చు కన్నా రోడ్డుపైన రవాణా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాకాకుండా వీళ్లు రైలు కం షిప్ ప్రతిపాదనను ముందుకు తీసుకొస్తున్నారని తెలుస్తుంది.
 

దీని ద్వారా సౌదీ అరేబియా నుండి బయటకు, బయట నుండి సౌదీ అరేబియాకి, ఇటు నుండి అమెరికాకు ట్రాన్స్పోర్ట్ సులభం అయ్యే ప్రయత్నం ఇది అని తెలుస్తుంది. దీని ద్వారా ఎంతవరకు అయితే అంతవరకు రైళ్ల ద్వారా తర్వాత షిప్స్ ద్వారా రవాణాను కొనసాగించే పద్ధతి ఇది అని తెలుస్తుంది. ఇప్పటివరకు 2.3 మిలియన్ల సరుకు రవాణా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బి ఆర్ ఐ కి ప్రత్యామ్నాయంగా ఈ ప్రతిపాదనను ఇజ్రాయిల్ తీసుకొచ్చిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: