ఆంధ్రప్రదేశ్  అప్పుల గురించి తప్పుడు ప్రచారం  బయట జోరుగా సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ రకంగా రాష్ట్రం ఇంత అప్పు చేసిందీ, దీనివల్ల మీ భవిష్యత్తు ఇలా అంధకారంలోకి వెళ్ళబోతుంది అన్నట్లుగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు అవతలి వాళ్ళు. ముఖ్యంగా రెండు పత్రికలు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చూస్తుంటే, ఒక పత్రిక మాత్రం ప్రభుత్వాన్ని నిలబెట్టే పనిలో ఉందని తెలుస్తుంది.


అవేర్నెస్ పేరుతో అప్పుల తప్పుడు ప్రచారం చేయడం కోసం నిపుణుల పేరుతో ఈనాడు ఇంటర్వ్యూలు చేసుకుంటూ వస్తుంది. ఇప్పటికే 10లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది, మళ్లీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అప్పుల ఊబిలోకి కూరుకు పోతుంది అన్నట్లుగా ప్రాజెక్టు చేసుకుంటూ వస్తుందది. అసలు అప్పు 4లక్షల కోట్ల రూపాయలే అని కాగ్ చెప్తుంది, ఆర్.బి.ఐ చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది.


కానీ వీళ్లు మాత్రం పది లక్షల కోట్ల రూపాయలు అంటూ చెప్పుకొస్తున్నారని తెలుస్తుంది. ఇదివరకు కూడా జగన్ కేసుల్లో 1500కోట్ల రూపాయల కేసులు తీసుకొచ్చి, లక్ష కోట్ల రూపాయల అని చెప్పి విష ప్రచారం చేశారు. ఒకప్పుడు జర్మనీ నియంత హిట్లర్ సమాచార మంత్రి గ్లోబల్స్ ఎలాగైతే తప్పుడు ప్రచారం చేశాడో, అలాగే వీళ్ళు కూడా ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నట్లుగా తెలుస్తుంది అంటున్నారు కొంతమంది. అప్పుడు జగన్  లక్ష కోట్లని చెప్పి ప్రచారం చేస్తే, ఇప్పుడు రాష్ట్రం విషయంలో 10లక్షల కోట్లు అప్పు ఉందని ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.


ప్రజలకు ఉన్న విషయాన్ని చెప్పాల్సిన స్వేచ్ఛ ఉన్న పత్రికలు కూడా ఇలా ప్రచారం చేయడం విడ్డూరం అని కొంతమంది భావిస్తున్నారు. ఇలా ఎవరు పత్రికలు వాళ్ళు పెట్టుకొని పక్కవారిపై ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మరి కొంతమంది అడుగుతున్నారు. ఈ రకరకాల ప్రచారాలలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని సాధారణ జనం   అనుకుంటున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: