ప్రతి చిన్నదానికీ జగన్మోహన్ రెడ్డి మీద బురదచల్లేస్తున్న చంద్రబాబునాయుడుకు నరేంద్రమోడిని ప్రశ్నించే ధైర్యం ఉన్నట్లు లేదు.  కరోనావైరస్ నేపధ్యంలో దేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మోడి మాత్రమే తీసుకుంటున్నాడు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడి నిర్ణయాన్ని పాటిస్తున్నారంతే. జనతా కర్ఫ్యూ అన్నా, లాక్ డౌన్ అన్నా అంతకుముందు తప్పట్లు కొట్టాలన్నా, లైట్లు బంద్ చేసినా అంతా మోడి నిర్ణయం ప్రకారమే కదా జరుగుతోంది ?

 

మరి అన్నీ విషయాలు తెలిసిన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మోడిని నిలదీయకుండా జగన్ పై ఆరోపణలు చేయటంలో అర్ధమేంటి ?  తాజాగా లిక్కర్ షాపులను తెరవాలన్న నిర్ణయం తీసుకున్నది కూడా మోడినే అన్న విషయం అందరికీ తెలిసిందే. జాతీయ పాలసీలో భాగంగా మోడి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే దాదాపు చాలా రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. అలాంటిది మద్యంషాపులు తెరవటం అన్నది జగన్ సొంత నిర్ణయమని చంద్రబాబు అండ్ కో గగ్గోలు పెట్టటంలో అర్ధమేంటి ?

 

మద్యంషాపులను తెరవాలన్నది కేంద్రం నిర్ణయం కాగా ధరలు పెంచాలన్నది మాత్రమే జగన్ నిర్ణయం. ఒకవేళ జగన్ నిర్ణయం తప్పయితే ఇదే విషయాన్ని మోడిని చంద్రబాబు నిలదీయోచ్చు కదా ? కేంద్రం  తీసుకున్న నిర్ణయం తప్పని చంద్రబాబు ప్రధానమంత్రిని నిలదీయవచ్చు కదా ?  కరోనా వైరస్ తీవ్రత, ముందు జాగ్రత్తలు, నియంత్రణ లాంటి అనేక అంశాలపై మోడికి లేఖ రాసిన చంద్రబాబు మద్యంషాపులు తెరవటంపై ఎందుకు మోడితో మాట్లాడకూడదు ?

 

కాబట్టి మద్యం వివాదంలో చంద్రబాబు ప్రశ్నించాలంటే ముందుగా మోడిని నిలదీయాలి. తర్వాతే జగన్ పై ఆరోపణలు చేయాల్సుంటుంది. అయితే మోడిని ప్రశ్నించే ధైర్యం చంద్రబాబుకుందా ? అన్నదే అనుమానం. ఎందుకంటే మోడిని ప్రశ్నిస్తే తన భవిష్యత్తు ఏమవుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు. ఎన్డీఏలో నుండి వచ్చేసిన తర్వాత ఇదే చంద్రబాబు ఇదే మోడిని నానా మాటలన్నాడు. ఎన్నికల్లో మోడి రెండోసారి ఘన విజయం సాధించిన తర్వాత మళ్ళీ మోడికి దగ్గరవుదామని ఎంత ప్రయత్నిస్తున్నా చంద్రబాబు వల్ల కావటం లేదు. అందుకనే మోడి గురించి ఏమీ మాట్లాడటం లేదు.

 

అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే మోడిని ప్రశ్నించే ధైర్యం లేకే జగన్ విషయంలో చంద్రబాబు నానా యాగీ చేస్తున్నాడు.  ఒక్క చంద్రబాబే కాదు మొత్తం టిడిపి నేతలు, ఎల్లోమీడియా కూడా ఎక్కడా మోడి గురించి ఒక్క నెగిటివ్ వార్త కూడా అచ్చేయటం లేదు. మోడి తీసుకుంటున్న నిర్ణయాలను కూడా జగన్ కు అంటగట్టేసి ప్రభుత్వంపై బురద చల్లేస్తున్నాయి. జరుగుతున్న వ్యవహారాలు మొత్తాన్ని జనాలు చూస్తున్నారు. అందుకనే వీళ్ళ గోలపై జనాలెవరూ పెద్దగా స్పందించటం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: