ముందుగా మీరు బరువు తగ్గాలి అనుకుంటే  బ్రెయిన్‌ను కంట్రోల్‌లోకి తెచ్చుకుంటే ఇక ఈజీగా బరువు తగ్గడమే కాదు... ఏదైనా చెయ్యగలం. బరువు తగ్గే విషయంలో... బరువు తగ్గగలను అనే పాజిటివ్ ఆలోచన వల్లే మంచి ఫలితాలు కూడా  కనిపిస్తున్నాయని పరిశోధనలలో కూడా తేలింది. అది ఎలాగో  తెలుసుకుందాం  మరి...


ఈ రోజుల్లో బరువు తగ్గడం అన్నది ఒక పెద్ద సమస్య అయిపోతోంది. జిమ్‌లకు వెళ్లి గంటల తరబడి కుస్తీలు పడితే తప్ప కొవ్వు తగ్గడం లేదు. బాధాకరం ఏంటంటే... కొంతమంది జిమ్‌కి వెళ్లినా బరువు తగ్గట్లేదు. ఇక తగ్గుట పోవడానికి కారణం వాళ్లు తెగ తినేస్తున్నారనుకుంటే చాలా పెద్ద పొరపాటే. నిజానికి కారణం అది కాదు.


 ఒత్తిడి, టెన్షన్, ఎప్పుడు కాలంతో పరుగులు పెడుతూ ఉండేవారు బరువు పెరుగుతున్నారు. తిండి వల్ల బరువు పెరిగితే... జిమ్‌కి వెళ్లడం ద్వారా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. అదే మెంటల్ టెన్షన్ల వల్ల బరువు పెరిగితే... మాత్రం తిరిగి మెంటల్ పీస్ వల్లే తగ్గే ఛాన్స్ ఉందని పరిశోధనల లో కూడా తెలియచేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే... మనసు అనేది  ప్రశాంతంగా ఉంటే... నేను బరువు తగ్గుతున్నాను అనే పాజిటివ్ ఫీలింగ్స్ పెంచుకుంటే... ఆటోమేటిక్‌గా బరువు తగ్గుతారని పరిశోధనలు బయటపెట్టాయి. వీలైనంతవరకూ నవ్వుతూ ఉంటే టెన్షన్లు నుంచి రిలాక్స్ అవ్వవచ్చు.


ఒత్తిడి, టెన్షన్లు ఎక్కువైతే... మన శరీరంలో కార్టిసాల్ అనేది కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.దేని కారణంగా మన శరీరంలో  కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ రింగ్ లాంటిది వస్తుంటుంది కొంత మందికి. దానికి ముఖ్య  కారణం ఈ కార్టిసాలే. దీని అంతు చూస్తే తప్ప కొవ్వు కరగదు. అలా జరగాలంటే పాజిటివ్ థింకింగ్  కచ్చితంగా పెరగాలి. ఈ కార్టిసాల్ వల్ల బీపీ కూడా వస్తుంది జాగ్రత్తగా ఉండండి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: