ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న దేశాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా బారిన పడి 3,000 మందికి పైగా మృతి చెందగా దాదాపు 90,000 కరోనా బాధితుల కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా కరోనా నుండి ఉపశమనం లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. 
 
సోషల్ మీడియాలో చైనీస్ ఫుడ్ తింటే కరోనా బారిన పడతామని వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజానికి చైనీస్ ఫుడ్ తింటే కరోనా రాదు. కానీ చైనీస్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు. వీలైనంత వరకు చైనీస్ రెస్టారెంట్లకు, చైనీస్ ఫుడ్ కు దూరంగా ఉంటే మంచిది. సోషల్ మీడియాలో ఉడికించిన వెల్లుల్లి నీటిని తాగితే కరోనాను మొదట్లోనే నివారించవచ్చని వార్త వైరల్ అవుతోంది. వెల్లుల్లిలో వైరస్ ను చంపే లక్షణాలు ఉన్నా వెల్లుల్లి కరోనాను చంపుందనడంలో నిజం లేదని వైద్యులు చెబుతున్నారు. 
 
ఐస్ క్రీమ్స్, కుల్ఫీ, శీతల పానీయాలు తాగితే కరోనా వ్యాపిస్తుందని జరుగుతున్న ప్రచారం కూడా నిజం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ  చల్లని ఆహార పదార్థాల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని ఎక్కడా చెప్పలేదు. నోటిని ఉప్పునీటితో కడగడం వల్ల కరోనా తగ్గుతుందని సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. వైద్యులు ఉప్పు నీరు వైరస్ ను నివారించడంలో సహాయపడుతుందనే పుకారును ఖండించారు. ప్రజలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లను నమ్మవద్దని వైద్యులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: