ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. కూరగాయల రసం వల్ల చాలా లాభాలు వున్నాయి. ఆ లాభాలు ఏంటో తెలుసుకోండి... కూరగాయల రసం వల్ల శరీరం చాలా  హైడ్రేటెడ్ గా ఉంటుంది. మీరు రోజులో తీస్కోవలసిన నీటిలో కొంత నీరు ఈ జ్యూస్ రూపం లో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ డ్రింక్స్ ఏ హెల్త్ స్టోర్ లో అయినా ఈజీగా దొరికేస్తాయి. కానీ,నాచురల్ విటమిన్స్ ఉన్నప్పుడు బాటిల్డ్ విటమిన్స్ ఎందుకు? వెజిటబుల్ జ్యూస్ లో మినరల్స్, విటమిన్స్ తో పాటూ క్లోరోఫిల్ కూడా ఉంటుంది.జుట్టు పెరుగుదలకు  పాలకూర, క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయ హెల్ప్ చేస్తాయి. వీటిని జ్యూస్ చేసుకుని తాగితే జుట్టు బాగా పెరుగుతుంది. ఆకుకూరలు, క్యాప్సికం వంటివి హెయిర్ లాస్ ని ప్రివెంట్ చేస్తాయి. వీటిని జ్యూస్ చేసి తాగితే మీకు కావాల్సిన ఫలితం లభిస్తుంది.గుమ్మడికాయ, బ్రకోలి, చిలగడ దుంప, క్యారెట్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరెంజ్ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సీ ఉన్న వెజిటబుల్స్ యొక్క జ్యూస్ తాగితే యాక్నే, పింపుల్స్ సమస్య తగ్గుతుంది.


టమాటా, బంగాళ దుంప, ముల్లంగి, క్యాబేజ్, క్యారెట్స్ స్కిన్ కి గ్లో ఇస్తాయి.విటమిన్ సీ ఉన్న బ్రకోలీ, క్యాప్సికం, కాలీ ఫ్లవర్, టమాటా, విటమిన్ ఈ ఉన్న టర్నిప్ గ్రీన్స్, సెలీనియం వెజిటబుల్స్ చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి.ఒక కప్పు వెజిటబుల్ జ్యూసులో చాలా రకాల వెజిటబుల్స్ ఉంటాయి. అంటే, సుమారు ఐదు కప్పుల కూరగాయలని జ్యూస్ తీస్తే ఒక కప్ జ్యూస్ వస్తుంది. అందువల్లనే, ఈ జ్యూస్ తాగితే న్యూట్రియెంట్స్ హై లెవెల్ లో అందుతాయి. ఫలితంగా హ్యాపీగా హెల్దీగా ఉండగలుగుతారు.  శరీరం తనకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ గ్రహించుకోగలదు. కూరగాయలు తిన్నప్పుడు బాడీ న్యూట్రియెంట్స్ ని ఫైబర్ నుండి విడదీసి అప్పుడు తనకి అవసరమైన న్యూట్రియెంట్స్ ని తీసుకుంటుంది. ఇది కొద్దిగా టైమ్ పట్టే ప్రాసెస్. మీరు సరిగ్గా నమలక పోయినా, మీ డైజెస్టివ్ సిస్టమ్ బలహీనం గా ఉన్నా ఈ పద్ధతిలో అంత మంచి ఫలితాలు రావు.


అందుకే, ఫ్రెష్ వెజిటబుల్ జ్యూస్ ద్వారా ఈ న్యూట్రియెంట్స్ ని ఈజీగా అందుకోవచ్చు.కూరగాయల నుండి వచ్చే పోషకాలన్నీ అందుకోవాలంటే మీరు రోజంతా కూరలు నములుతూనే ఉండాలి. అది కుదరదు కాబట్టే జ్యూస్ చేసి తాగేస్తే ఒక కప్ తో మనకి కావాల్సిన న్యూట్రియెంట్స్ వచ్చేస్తాయి. పొద్దున్నే పరగడుపున ఒక గ్లాస్ కూరగాయల రసం త్రాగడం అలవాటు చేసుకోండి... ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: