
పూర్వం రోజుల్లో భోజనం చేసాక సోంపు తప్పకుండా తినేవారు.కానీ ఇప్పుడు హోటల్స్ లలో , రెస్టారెంట్ లలో భోజనం చేసినప్పుడు మాత్రమే షుగర్ కోట్ ఉన్న సోంపు చివర్లో తింటూ ఉంటాం. అదే షుగర్ కోటెడ్ సోంపు కాకుండా నేచురల్ సోంపును ప్రతి రోజు భోజనం అయ్యాక తింటే ఎన్ని లాభాలు ఉన్నాయి.
సోంపులో పొటాషియం పుష్కలంగా ఉండుట వలన బ్లడ్ ప్రెషర్ పెరగకుండా క్రమబద్ధీకరిస్తుంది.దాంతో గుండే సంబంధిత రోగాలు వచ్చే అవకాశం తగ్గుతుంది.అంతేకాక రక్తనాళాలు ముడుచుకుపోకుండా వెడల్పుగా ఉండేలా చేసి రక్త సరఫరా బాగా అయ్యేలా సహాయపడుతుంది.
ఐరన్, కాపర్ అధికంగా ఉండుట వలన రక్తం బాగా అభివృద్ధి చెందుతుంది.రక్తహీనతతో బాధపడేవారికి సోంపు మంచి మందుగా పనిచేస్తుంది.ఇది రక్తహీనత తగ్గించుకోవడానికి గర్భిణీ స్త్రీలకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
సోంపులో మాంగనీస్, జింక్, కాపర్, ఐరన్, కాల్షియం, పొటాషియం, సెలీనియం, మెగ్నిషయం వంటి ఖనిజ లవణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో క్యాన్సర్ కలించే ప్రీ రాడికల్స్ తొ పోరాడి క్యాన్సర్ కారకాలను నివారిస్తుంది.భోజనం చేసిన వెంటనే స్ప్మ్పు తినటం వలన నోటిలో బ్యాక్టీరియా నశించి నోరు తాజాగా ఉంటుంది.
అలాగే దంతాలు,చిగుళ్లు బలంగా తయారవుతాయి.సోంపు తినటం వలన జీర్ణక్రియ మెరుగుపడి జీర్ణ సంబంధిత రోగాలు రాకుండా నివారిస్తుంది.