ప్రెగ్నెన్సీ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కడుపులో పెరిగే బిడ్డ మీరు తీసుకొనే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు తీసుకొనే ఆహారంలో న్యూట్రిషియన్స్ అధికంగా ఉండేట్లు చూసుకోవాలి. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. అలాగే గర్భం దాల్చిన తర్వాత ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలనేది ప్రతి తల్లిలో ఉండే అనుమానం. ఆ అనుమానాల్లో.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూల్ డ్రింక్స్ తాగొచ్చా..? తాగ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుంది అన్న ప్ర‌శ్న‌లు కూడా ఉన్నాయి.

 

వాస్త‌వానికి కూల్ డ్రింక్స్ లో బలాన్ని ఇచ్చే న్యూట్రియంట్స్ మోతాదు కన్నా శరీరానికి ఇబ్బంది కలిగించే కెఫీన్ అధిక మోతాదులో ఉంటుంది. అందుకనే ఆరోగ్య నిపుణులు గర్భంతో ఉన్న మహిళలకే కాకుండా అందరినీ కూడా కూల్ డ్రింక్స్ తీసుకోవద్దనే సూచిస్తున్నారు. అలాగే కూల్ డ్రింక్స్ లో కెఫీన్ వలన మిస్ క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అలాగే ఎముకల బలాన్ని తగ్గించివేస్తుంది, నిద్రను దెబ్బతీస్తుంది మరియు కడుపులోని బిడ్డకు కూడా అంత మంచి కాదు.

 

కాబ‌ట్టే, క‌డుపుతో ఉన్న‌ప్పుడు కూల్ డ్రింక్స్ తీసుకోవ‌ద్దంటారు. అదేవిధంగా, కూల్ డ్రింక్స్ పట్ల ఆకర్షితులను చేయడానికి కొన్ని కూల్ డ్రింక్స్ కంపెనీలు తమ సాఫ్ట్ డ్రింక్స్ లలో కొన్ని రకాల రంగులను, ఫ్లేవర్స్ ను కలుపుతూ ఉంటారు. ఇది కడుపులోని బిడ్డకు ఒక విధంగా ప్రమాదమే అని అంటున్నారు డాక్టర్స్. పుట్టుకతో కొంతమంది పిల్లలు అనారోగ్య  సమస్యలతో జన్మిస్తూ ఉంటారు. ఆ సమస్యలకు గర్భంతో ఉన్నప్పుడు తీసుకునే శీతల పానీయాలు కూడా ఒక కారణం అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: