
బీట్‌రూట్ సహజమైన రంగు పదార్థం. ఇది పెదవులకు సహజ గులాబీ రంగును ఇస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఉండి ముడతలు, మృత కణాలు తొలగించడంలో సహాయపడతాయి. రోజూ రాత్రి నిద్రకు ముందు తరిగిన బీట్‌రూట్ ముక్క పెదవులకు రాయాలి. అలానే ఉండనివ్వాలి. ఉదయం కడగాలి. అల్లం పొడి + తేనె మిశ్రమం, అల్లం లోని న్యాచురల్ వర్మింగ్ ప్రాపర్టీస్ వల్ల రక్త ప్రసరణ పెరిగి పెదవులు సజీవంగా మారతాయి. తేనెతో కలిపితే మృదుత్వం వస్తుంది. వారం లో 2 సార్లు మాత్రమే వాడాలి. మోస్తరు గా అప్లై చేయాలి. చక్కెర + తేనె స్క్రబ్, పెదవులపై ఉన్న మృత కణాలను తొలగించడంలో చక్కెర సహాయపడుతుంది. తేనె తేమనిస్తుంది.
1 టీ స్పూన్ చక్కెర, 1/2 టీ స్పూన్ తేనె కలిపి మృదువుగా పెదవులపై 2 నిమిషాల పాటు రుద్దాలి. వారం లో 2 సార్లు చెయ్యండి. రాత్రి నిద్రకి ముందు కొన్ని బిందువులు బాదం నూనెను పెదవులకు మసాజ్ చేయండి. ఇది పొడిబారిన పెదవులకు తేమనిస్తూ సహజమైన రంగును తెస్తుంది. సూర్యరశ్మి పెదవులను ముదురుగా మారుస్తుంది. రోజుకు కనీసం 2.5 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరానికి తేమ సరిపోతుంది. పెదవులు పొడిబారకుండా ఉంటాయి. పొగతాగడం వల్ల పెదవులు నలుపుగా మారతాయి. ఇది బ్లడ్ సర్క్యులేషన్‌ను దెబ్బతీస్తుంది.