సోషల్ మీడియాలో కొన్ని వార్తలు విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉంటాయి . అసలు ఆ వార్త నిజమా ..? అబద్దమా..? అని తెలుసుకోవడం పెద్ద తలనొప్పి . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తాజాగా సోషల్ మీడియాలో మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ కి సంబంధించిన ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. సినీ వర్గాలలో మెగా హీరోస్ అంటే సపరేట్ రెస్పెక్ట్ ఇస్తారు. అది అందరికి తెలుసు. కొన్ని తప్పులు చేసిన చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు . అదంతా మెగాస్టార్ చిరంజీవి కోసమే .


అయితే పంజా వైష్ణవ్  తేజ్  ఇప్పుడు ఇండస్ట్రిలో హీరోగా ఉన్నాడు అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మెగాస్టార్ చిరంజీవి . అయితే ఇప్పుడు ఆయన ఇచ్చిన రెస్పెక్ట్ ను ..పరువును వైష్ణవ్ తేజ్ పోగొట్టేస్తున్నాడు అంటున్నారు అభిమానులు . తాజాగా ఆయన ఒక సినిమా కమిట్ అయ్యారట . అడ్వాన్స్ కూడా తీసుకున్నారట.  అయితే ఈలోపే వేరే సినిమా రావడంతో మంచి డైరెక్టర్ కావడంతో .. ఈ సినిమాకి ఇచ్చిన కాల్ షీట్స్ ఆ సినిమాకి కేటాయించేసారట.  ఇప్పుడు ఈ చిన్న డైరెక్టర్ వదిలేసుకుని.. పెద్ద సినిమాకి ఓకే చేశాడట.



ఇప్పుడు ఆ చిన్న డైరెక్టర్.."మీరు ఇలా చేస్తే ఎలా అని వైష్ణవ్ తేజ్ ని అడుగుతుంటే రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వడం లేదట". చిన్న డైరెక్టర్ కావడంతో ఆదరించే దిక్కు కూడా లేక అల్లాడిపోతున్నాడు ఈ సో కాల్డ్ చిన్న డైరెక్టర్ అంటూ ఫిలిం వర్గాలలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.  అంతేకాదు ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా పరువు పోయిన్నట్లైంది.  ఇలాంటప్పుడు మెగాస్టార్ చిరంజీవి పట్టించుకోవాలి కదా..? అని కొందరు అంటుంటే కొంతమంది మెగాస్టార్ చిరంజీవి వాళ్ళకి సపోర్ట్ చేసి తప్పు చేశారని కూడా మాట్లాడుతున్నారు.  కొంతమంది అసలు ఇది ఎవరో కావాలనే పంజాబ్ వైష్ణవ్  పేరు చెడ కొట్టడానికి ఈ విధంగా చేస్తున్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు . అయితే ఇప్పటివరకు దీనిపై మెగా హీరో కానీ మెగా ఫ్యామిలీ కానీ ఏ విధంగా స్పందించలేదు . సోషల్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతున్నాయి . ఈ వార్త ఎంతవరకు నిజమనేది తెలియాలి అంటే మాత్రం మెగా ఫ్యామిలీ స్పందించే వరకు ఆగాల్సిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి: