మహవతార్ నరసింహ మూవీ ప్రస్తుతం థియేటర్లలో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ సినిమా స్టార్ హీరో సినిమాకు పోటీగా దిగి స్టార్ హీరోల సినిమాలనే పక్కకు నెడుతుంది. హరిహర వీరమల్లు మూవీ తర్వాత విడుదలైన మహావతార్ నరసింహ మూవీ హరిహర వీరమల్లు మూవీ కలెక్షన్స్ ని ఎప్పుడో దాటేసింది.దాదాపు 5, 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది అంటే ఈ సినిమాకి థియేటర్లలో ఎంత ఆదరణ దక్కుతుందో చెప్పనక్కర్లేదు. ఓ హీరో లేదు హీరోయిన్ లేదు కానీ ఈ సినిమా థియేటర్లో సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన సంగతి మనకు తెలిసిందే. మైథలాజికల్ సినిమాగా తెరకెక్కిన ఈ యానిమేషన్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. 

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు అశ్విన్ కుమార్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అయితే ప్రమోషన్ లో పాల్గొన్న డైరెక్టర్ కి ఒక షాకింగ్ ప్రశ్న ఎదురయింది. ఒకవేళ ఈ యానిమేటెడ్ మూవీని లైవ్ యాక్షన్ ఫిల్మ్ గా తీస్తే ఇందులో శ్రీరాముడి పాత్ర కోసం ఏ హీరోని తీసుకుంటారు అంటూ ప్రశ్నించారు.అయితే ఈ ప్రశ్నకు దర్శకుడు ఏమాత్రం ఆలోచించకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు చెప్పేశారు.దీంతో ఈయన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అయితే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆర్ఆర్ఆర్ మూవీలో ఆల్రెడీ కనిపించారు.అప్పటినుండి శ్రీరాముడు పాత్రకు రాంచరణ్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతారు అనే భావన ఇండస్ట్రీలో ఉంది.

ముఖ్యంగా ఆది పురుష్ వంటి సినిమా వచ్చిన సమయంలో కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ అయితే రాముడు గా అద్భుతంగా సెట్ అయ్యేవాడు అని మాట్లాడుకున్నారు. అలా సోషల్ మీడియా మొత్తం రాముడి పాత్ర కోసం రామ్ చరణ్ అయితేనే సెట్ అవుతారు అనే ప్రచారం ఎప్పటినుండో జరుగుతుంది.ఇలాంటి వేళ డైరెక్టర్ అశ్విన్ కుమార్ రాముడి పాత్ర కోసం రామ్ చరణ్ ని తీసుకుంటామని చెప్పడంతో ఈ విషయం వైరల్ గా మారింది.అంతేకాదు మెగా ఫ్యాన్స్ ఈ విషయాన్నీ వైరల్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. ఇప్పటికే మహావతార్ నరసింహ సినిమాతో సినిమాటిక్ యూనివర్స్ కి పునాది పడిపోయింది. ఇక ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ఇంకా ఎన్నెన్ని అద్భుతాలు చూడాల్సి వస్తుందో. అంతే కాదు ఈ ఫ్రాంచైజీలో లైవ్ యాక్షన్ సినిమాలు కూడా తీసుకురాబోతున్నట్టు ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల నుండి టాక్ వినిపిస్తున్న వేళ రామ్ చరణ్ రాముడి పాత్ర కోసం తీసుకుంటామని డైరెక్టర్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: