టాలీవుడ్ చిన్న సినిమాల లిస్టులో సెన్సేషనల్ హిట్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు ‘బేబి’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లాంటి యువ నటులతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలు మించి వంద కోట్ల వసూళ్లు సాధించి, చిన్న సినిమాలకు గొప్ప ఉదాహరణగా నిలిచింది. డైరెక్టర్ సాయిరాజేష్ మరియు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కలిసిన మ్యాజికల్ టీం అందించిన ఈ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకుల గుండెల్లో దూరిపోయింది. ఈ విజయం తర్వాత అదే టీం మరో సినిమాకు ప్లాన్ చేసింది. ఆనంద్ – వైష్ణవి జంటగా మళ్లీ స్క్రీన్‌పై కనబడబోతున్నారని ఆశించినవారికి షాక్ తగిలింది. ఎందుకంటే ఆ సినిమా నుండి ఇద్దరూ తప్పుకున్నారు.


 వారి స్థానాల్లో కిరణ్ అబ్బవరం – శ్రీ గౌరీప్రియ జంటగా కొత్తగా రూపొందుతుంది. అప్పట్లో ఈ మార్పులపై గట్టి ప్రచారం నడిచింది. ముఖ్యంగా వైష్ణవిని టార్గెట్ చేస్తూ ఎస్కేఎన్ వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. “తెలుగమ్మాయిలను ఎంకరేజ్ చేయకూడదా?” అంటూ వచ్చిన కామెంట్లు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎస్కేఎన్ వివరణ ఇచ్చినప్పటికీ అభిమానుల్లో సందేహాలు మిగిలిపోయాయి. బేబి టీంలో ఫార్ములా ఫెయిలైందంటూ గాసిప్స్ పెరిగిపోయాయి. కానీ ఇప్పుడు ఆ వార్త‌లు అన్నీ పక్కకు పోయేలా ఒక బ్యూటిఫుల్ మోమెంట్ చోటు చేసుకుంది. ‘బేబి’ సినిమాకు రెండు నేషనల్ అవార్డులు రావడంతో టీం మళ్లీ ఒక్కచోటికి చేరింది. నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సాయిరాజేష్, ఎస్కేఎన్, ఆనంద్, వైష్ణవి అందరూ పాల్గొన్నారు.


మీడియా ముందు ఎంతో ఫ్రెండ్లీగా, నవ్వులు పంచుకుంటూ మాట్లాడిన వీరంతా గత గ్యాప్‌కు ముగింపు పలికినట్టే కనిపించారు. ఓ విలేకరి "మీకు వైష్ణవికి మధ్య గొడవ జరిగిందట కదా?" అని అడిగితే, ఆనంద్ చక్కగా నవ్వుతూ "అలాంటిదేమీ లేదు.. మీరు కొత్తగా సృష్టించుకుంటున్నారు" అంటూ క్లారిటీ ఇచ్చాడు. చివరకు, ‘బేబి’ సినిమాతో కలిసినవాళ్లంతా ఇప్పుడు మళ్లీ కలిసి కనిపించడం అభిమానులకి ఆనందాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీలో చిన్న సినిమాలు పెద్ద విజయాలు అందుకోవచ్చని నిరూపించిన బేబి టీం – ఇప్పుడు ఆ అవార్డు గౌరవంతో మరింత మెరిసిపోతోంది. గత విభేదాలు పక్కన పెట్టి ముందుకు వెళ్తుండటం నిజంగా ఓ గుడ్ సైన్!

మరింత సమాచారం తెలుసుకోండి: