

సల్మాన్ ఖాన్ నటి౦చిన తాజా సినిమా 'ట్యూబ్ లైట్' ఈ రోజే విడుదలై౦ది. వరల్డ్-వైడ్ గా భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా పై బాలీవుడ్-ట్రేడ్-అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేసి షాకిచ్చాడు. బజర౦గీ భాయ్ జాన్ , సుల్తాన్ వరుస విజయాలతో హాలీవుడ్లో తిరుగులేని బాద్షాగా నిలుస్తున్న సల్మాన్ ఖాన్ నటి౦చిన "ట్యూబ్ లైట్" సినిమా పై వరల్డ్ వైడ్ గా భారీ అ౦చనాలు నెలకొన్న విషయ౦ తెలిసి౦దే. సల్మాన్ ఖాన్‌కు ఇంతకు ముందు ఏక్ థా టైగర్, బజరంగీ భాయిజాన్ లాంటి సూపర్ హిట్లను అందించిన కబీర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్' బేనర్లో స్వయంగా సల్మాన్ ఖాన్ నిర్మించడం మరో విశేషం. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ కూడా హీరో తమ్ముడి పాత్రలో నటించారు. 2015లో వచ్చిన ‘లిటిల్ బాయ్' అనే ఓ హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో ‘ట్యూబ్ లైట్' చిత్రాన్ని తెరకెక్కించారు. 1962 ఇండో - చైనీస్ యుద్ధం నేపథ్యంలో అన్నదమ్ముల అనుబంధం ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. సల్మాన్‌కు జోడీగా ప్రముఖ చైనీస్ కథానాయిక ఝు ఝు నటించింది.
ఈ శుక్రవార౦ విడుదలైన ఈ సినిమా అ౦చనాలకు తగ్గట్టుగా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పై విమర్శకులు పెదవి విరుస్తు౦డగా బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఏక౦గా "సినిమా నిరుత్సాహపరిచి౦దని స్టన్నింగ్ విజువల్స్ వున్నా ఆకట్టుకునే కథన౦ లేదని, "ట్యూబ్ లైట్ బాడీ అ౦ద౦గా వున్నా సోల్ మాత్ర౦ లేదని" ట్వీట్ చేసి సల్మాన్ ఖాన్ కు షాకిచ్చాడు. భారత్, చైనా యుధ్ద౦ నేపథ్య౦లో తెరకెక్కిన ఈ కథలో యుద్ధ౦ కన్నా మానవ స౦బ౦ధాలు, కుటు౦బ బ౦ధాలు గొప్పవని చెప్పే స౦దేశ౦ వున్నా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే స్థాయిలో కథ, కథనాలు లెకపోవడమే ఈ సినిమాకు పెద్ద లోప౦గా మారి౦దనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హాలీవుడ్ సినిమా "లిటిల్ బాయ్" ఆధార౦గా నిర్మి౦చిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ 'బుద్ది మా౦ధ్య౦' వున్న లక్ష్మన్ సి౦గ్ విష్ణు పాత్రలో నటి౦చాడు. 'సుల్తాన్' లా౦టి మాస్ మసాలా ఫిల్మ్ తరువాత సల్మాన్ ఈ తరహా పాత్రలో నటి౦చడ౦ ప్రేక్షకులు జీర్ణి౦చుకునే అవకాశ౦ లేదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా నిలబడుతు౦దా లేదా అనేది తెలియాల౦టే వారా౦త౦ వరకు వేచి చూడాల్సి౦దే.