సాక్షి చౌదరి మొన్న ఒక ట్వీట్ లో ఒక రాత్రికి కోటి ఇస్తామని చెప్పారని సంచలనం రేపింది. అయితే   హాట్ ఫోటోలు వీడియోలు చూసి తనకు నైటుకు కోటి రూపాయలు ఆఫర్ చేస్తున్న వారు ఉన్నారని.. కానీ తానూ 'సేల్' కి లేనని ఆమె చేసిన ట్వీటే ఈ హంగామాకంతా కారణం. సాక్షి నటించిన తాజా చిత్రం 'సువర్ణ సుందరి' త్వరలో విడుదలకు సిద్దం అవుతోంది.  ఈ కోటి-నైటు ట్వీట్ దెబ్బతో ఆ సినిమాపై అందరి దృష్టి పడింది.


ఒక రాత్రికి వస్తావా ... కోటి ఇస్తా ..!

కానీ ఇప్పడు మాత్రం ఆ ట్వీట్ ను డిలీట్ చేసేసింది అమ్మడు.  రీసెంట్ గా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన కోటి-నైటు గురించి అడిగితే ఉలుకూపలుకూ లేకుండా ఉండిపోయింది ఈ భామ.  అసలు కోటి రూపాయలు ఆఫర్ చేసిన వారు ఎవరని.. ట్వీట్ ఎందుకు డిలీట్ చేశారని అడిగితే సాక్షి సమాధానం చెప్పాడానికి ఇష్టపడలేదు. దీంతో ఇదో పబ్లిసిటీ స్టంట్ అయి ఉండొచ్చని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.


కోటి ఆఫర్ చేసేవాళ్ళు బిగ్ షాట్స్ అయి ఉంటారని.. దాంతో ఒత్తిడితోనే ఆ ట్వీట్ ను డిలీట్ చేసి కిమ్మనకుండా ఉందని కొందరు సాక్షిని వెనకేసుకొస్తున్నారు.  ఏదేమైనా సాక్షి స్వయంగా చెప్తేనే నిజాలేవో మనకు తెలిసేది. అప్పటివరకూ ఇలాంటి వెర్షన్లన్నీ ఊహాగానాల కిందే లెక్క.  అయితే త్వరలో విడుదల కానున్న సినిమా మీద ఇప్పటికే ఈ హీరోయిన్ చాలా ఆశలు పెట్టుకున్నది. ఈ సినిమా ఫ్లాఫ్ అయితే ఇక కష్టమే . 

మరింత సమాచారం తెలుసుకోండి: