
ఆగస్టు 15 న స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఈ ట్రైలర్ ను సినిమా థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇక అదే రోజు యూట్యూబ్ లో విడుదల చేయనున్నారని సమాచారం. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడం తో సాహో ఫై దేశ వ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. అందుకు తగ్గట్లు గానే సినిమాను సౌత్ తోపాటూ నార్త్ లోను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. బడా నిర్మాణ సంస్థలు సాహో థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నాయి.
హాలీవుడ్ సినిమా లకు దీటుగా హైవోల్టాగే యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రన్ రాజా ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ముఖ్యంగా దుబాయ్ లో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాలో హైలైట్ కానున్నాయి. ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కే 90 కోట్ల వరకు ఖర్చు చేశారట. మందిరా బేడీ , జాకీ ష్రాఫ్ ,నిల్ నితిన్ ముఖేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రాన్ని సుమారు 300కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. కాగా తనిష్క్ బాఘ్చి , గురు రంధావా సంగీతం సమకూరుస్తుండగా గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.