
ఎవరెన్ని చెప్పినా నందమూరి ఫ్యాన్స్‌లో చాలా మందిని ఎన్టీఆర్‌కు దూరం చేసే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అవుతుంటే కొందరు టీడీపీ అభిమానులు... కొందరు బాలయ్య అభిమానులు ఆ సినిమాలు ప్లాప్ అంటూ పెద్ద హడావిడి చేసేవారు. అయితే వాళ్లందరు ఎన్టీఆర్‌ను ఎంత తొక్కాలని చూస్తే ఎన్టీఆర్‌కు రోజు రోజుకు అంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది.
ఇక హరికృష్ణ కుటుంబంలోనూ ముందు ఎన్టీఆర్‌కు అంతంత మాత్రమైన గౌరవమే ఉండేది. దివంగత నందమూరి జానకీ రామ్ మృతి తర్వాత కళ్యాన్ రామ్, ఎన్టీఆర్ దగ్గరయ్యారు. ఇక హరికృష్ణ మరణం తర్వాత ఇప్పుడు వీళ్లిద్దరు ఒకరికి మరొకరు తోడుగా ఉంటున్నారు. ఇక తీవ్ర అప్పుల్లో ఉన్న కళ్యాణ్ రామ్‌ను ఆదుకునేందుకే ఎన్టీఆర్ జై లవకుశ సినిమా చేశాడు. ఆ సినిమా కోసం ఎన్టీఆర్ రెమ్యునరేషన్ తీసుకోలేదు సరికదా.. నివేద, రాశీఖన్నా లాంటి హీరోయిన్లకు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి సినిమాను లాగించేశారు.
బాబికి కూడా సర్దార్ ప్లాప్‌తో ఉండడంతో తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారు. మొత్తానికి సినిమా హిట్ అవ్వడం.. కళ్యాణ్ అప్పులు తీరిపోవడం జరిగాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తన అన్నను నిర్మాతగా నిలబెట్టాలని చూస్తున్నాడు. ఇద్దరూ కలిసి ఉమ్మడిగా సొంత బ్యానర్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. తన తర్వాత సినిమాను కళ్యాణ్‌రామ్ నిర్మాతగా చేపట్టేలా జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడట. అది కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఉంటుందని టాక్..?
ఏదేమైనా టీడీపీ వాళ్లలో కొందరు, అటు బాలయ్య అభిమానులు.. కొందరు చంద్రబాబు దురభిమానులు ఎన్టీఆర్‌ను ఎంత తొక్కాలని చూసినా ఈ అన్నదమ్ముల అనుబంధం ఇలా ఉంటేనే నందమూరి అభిమానులకు నిజమైన పండగ. ప్రతి నందమూరి అభిమాని ఈ అన్న దమ్ముల అనుబంధం చూసి మురిసిపోతాడనడంలో సందేహం లేదు. ఎవరు ఎన్టీఆర్ తొక్కాలని చూస్తారో వాళ్లంతట వాళ్లే పతనమవుతున్న తీరు కూడా ఇక్కడ మనం గమనించాలి.