సినిమా అంటే ఒకపుడు మరో ప్రపంచం. మనకు తెలియని లోకం. సినిమా చూడాలన్న కోరిక ప్రతి ఒక్క సగటు మనిషిలో ఉన్న రోజులు అవి. సినిమాలో ఉన్న వారు దేవతలు అని, వారు అమృతం తాగి అలా అందాలను కాపాడుకుంటారని, వయసు కూడా వారి దరి చేరదని అనుకునేవారు. అయితే గత రెండు దశాబ్దాలుగా టెక్నాలజీ పెరగడంతో సినీ మాయ మెల్లగా కరిగిపోతోంది.

సినిమా హీరోలు కూడా అవుట్ డోర్ పేరిట బయటకు రావడం, రియాలిటీ షోల పేరిట జనంతో కలసిపోవడంతో వారూ తమలాంటి వారేనని డిసైడ్ అయ్యారు సాదరజనం. అంతే కాదు స్మార్ట్ ఫోన్ల యుగంలో ఇపుడు ప్రతీ వారూ హీరోవే. షార్ట్ ఫిలిమ్స్  స్మార్ట్ ఫోన్ లో తీస్తూ తమ టాలెంట్ ని ఎవరికి వారు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు.

ఈ నేపధ్యంలో వెండి తెర హీరోలకు మునుపటి అంత క్రేజ్ లేదు, పైగా ఎవరి  కెరీర్ కూడా లాంగ్ రన్ లో సాగడంలేదు. ఇవన్నీ ఒక్కసారి కనుక ఆలోచిస్తే కొందరు స్టార్లూ. స్టార్ వారసులు తప్ప చాలా మంది హీరోలు ఒకటి రెండు సినిమాలకే మాయం అవుతున్నారు. అయితే ఇప్పటికీ తమ కెరీర్ ని అలా కంటిన్యూ చేస్తూ ఆరు పదుల వయసులో కూడా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో మన టాలీవుడ్ టాప్ ఫోర్ మాత్రం ఇంకా నాటౌట్ అంటున్నారు.

వారిలో మొదట చెప్పుకోవాల్సింది  మెగాస్టార్ చిరంజీవి. ఆయన 1978లో ప్రాణం ఖరీదు మూవీ తో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ నటిస్తూన ఉన్నారు. ఆయన వయసు ఆరున్నర పదులు అంటే నమ్మబుద్ధి కాదు. ఇలాగే మరో అయిదేళ్ళ పాటు నటించే స్టామినా కూడా మెగాస్టార్ సొంతం. అలాగే ఎన్టీయార్ నట వారసుడిగా వచ్చిన బాలకృష్ణ కూడా టాప్ రేంజి హీరోగా వెలుగుతున్నాడు. బాలయ్య కూడా ఆరు పదులు దాటిన హీరోవే.

ఇక అక్కినేని వారి వారసుడు నాగార్జున ఆరు పదులు దాటినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. సోగ్గాడుగా నవ మన్మధుడిగా వెండితెరను ఇప్పటికీ  పండిస్తున్నాడు. అదే విధంగా విక్టరీ వెంకటేష్ కూడా ఆరు పదుల వయసులో పక్కా మాస్ అంటూ నారప్పతో అదిరిపోయే పెర్ఫారెమెన్స్ ఇస్తున్నాడు. మన టాలీవుడ్ చరిత్రలో చూసుకుంటే ఆరు పదుల వయసు దాటినా అలసట లేని హీరోలుగా వీరిని చెప్పుకోవాలి.  వీరి హిస్టరీని బీట్ చేయడం తరువాత తరం అవుతుందా అంటే డౌటే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: