తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచమైన    అందాల తార  తాప్సీ. ఆ తరువాత బాలీవుడ్‌ బాట పట్టారు. ఉత్తరాదిన వరుస హిట్లతో దూసుపోతూ అగ్రకథానాయిక జాబితాలో చేరిపోయారు. పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథలనే ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న నటీ తాప్సీ.

టాలీవుడ్ ఇండస్ట్రీలో  రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా  వచ్చిన "ఝుమ్మంది నాదం" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. తాప్సీకి తెలుగు చిత్ర పరిశ్రమ కలిసిరాలేదు . ఆ తర్వాత  బాలీవుడ్‌కు వెళ్లి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది  తాప్సీ ముఖ్యంగా ‘పింక్’, ‘తప్పడ్’ వంటి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు మహిళా సమస్యలపై పోరాడే పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో వరుస బయోపిక్‌లు చేస్తూ మంచి ఆదరణ పొందుతోంది.తమిళంలో జయం రవితో కలిసి ‘జనగణమన’ సినిమాలో నటిస్తోంది. మర్డర్ మిస్టరీ సినిమా ‘హసీన్ దిల్‌రూబా’, అథ్లెటిక్స్ నేపథ్యంలో రానున్న ‘రష్మి రాకెట్’, క్రికెటర్ మిథాలీ రాజ్‌గా నటిస్తున్న స్పోర్ట్స్ బయోపిక్, విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్న మరో సినిమా కూడా ఈ యేడాదే సెట్స్ పైకి రాబోతున్నాయి. దర్శకుడు తేజ నిర్మిస్తున్న "అలివేలు వెంకటరమణ' సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

తాప్సీ ఓ ఇంటర్వ్యులో మాట్లాడుతూ గ్లామర్ ను నమ్ముకొని చేసిన సినిమాలు నాకు సంతృప్తిని, సక్సెస్ ఇవ్వలేదు.అలాంటి పాత్రలు చేస్తేనే తొందరగా గుర్తింపు వస్తుందని మొదట్లో  అనుకునేదాన్ని కానీ అది  సరైంది  కాదని తెలుసుకున్న . అందుకే లేడీ ఓరియంటెడ్ సినిమాలు, మంచి మెసేజ్ ఉన్న సినిమాలు, మనసుకు సంతోషాన్ని కలిగించే సినిమాల్లో నటించడం మంచిదనిపించింది. అలాంటి కథలనే ఎంచుకుంటూ సినిమాల్లో నటిస్తున్నాను. కొందరు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే అగ్ర హీరోలు తో నటించే అవకాశం రాదని, సినిమా అవకాశాలు తక్కువగా ఉంటాయని, ఎక్కువ కాలం సినీ ఇండస్ట్రీలో కొనసాగలేనని చాలా భయపెట్టారు. కానీ ఎవరినీ పట్టించుకోలేదు నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ నా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను అని తన అనుభవాలని పంచుకుంది హీరోయిన్ తాప్సీ.

మరింత సమాచారం తెలుసుకోండి: