

అసలు విషయం ఏమిటంటే భారత దేశం గర్వించదగ్గ గొప్ప బిజినెస్ టైకూన్స్ లో ఒకరైన సరిపల్లి కోటి రెడ్డి, ఆయన సతీమణి సరిపల్లి శ్రీజా రెడ్డి దంపతుల తనయుడు ఆటిజం బారిన పడడంతో దేశవిదేశాల్లోని అనేకమంది ప్రముఖ డాక్టర్లతో అతడికి వైద్యం చేయించారు. అయినప్పటికీ పెద్దగా ఫలితం దక్కలేదు. అయితే ఒక తల్లిగా తన బిడ్డ పడుతున్న కష్టం చూసి ఎంతో చలించిపోయి, అటువంటి కష్టం మరొక తల్లి పడకూడదనే గొప్ప మనసుతో పినాకిల్ బ్లూమ్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి అటిజం బారిన పడ్డ పలువురు బిడ్డలను అక్కున చేర్చుకుని వారికి పూర్తి ఉచితంగా చికిత్సను అందిస్తుండడంతో పాటు తల్లితండ్రులకు పలు సూచనలు చేస్తున్నారు శ్రీజా రెడ్డి మరియు ఆమె టీమ్.
ఇప్పటికే ఎందరో వేలాదిమంది తల్లులకు, బిడ్డలకు తమవంతుగా సాయమందించిన శ్రీజా రెడ్డి సరిపల్లి చేస్తున్న ఈ గొప్ప సేవ గురించి ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, మీడియా సంస్థలు సైతం కొనియాడడం జరిగింది. ఆ విధంగా తన దాతృత్వాన్ని చాటుకుంటున్న శ్రీజా రెడ్డి జన్మదినం నేడు కావడంతో పలువురు ఆమె సన్నిహితులు, శ్రేయోభిలాషులు, టీమ్ సభ్యులు ఆమె ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో తన కుటుంబంతో కలిసి నిండు నూరేళ్లు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు ...... !!