సినిమా
ఇండస్ట్రీ ఏదైనా కూడా
రీమేక్ సినిమాలు చేయడం జోరుగా జరుగుతున్నాయి.
బాలీవుడ్ మాత్రమే కాదు
టాలీవుడ్ కోలీవుడ్ లలో కూడా
రీమేక్ సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. సూపర్ హిట్ అయిన
సినిమా కథ హక్కులను కొని దానికి సదరు
ఇండస్ట్రీ నేటివిటీ ప్రకారం కథను స్క్రీన్ ప్లే నీ మార్చుకుని సినిమాలు చేసి సదరు హీరోలు, దర్శకులు సూపర్ హిట్లు కొడుతున్నారు. ఒకప్పుడు ఎక్కువగా
బాలీవుడ్ లోనీ సూపర్ హిట్ సినిమాలు ఇతర భాషలలో
రీమేక్ అయ్యేవి.
కానీ ఈ మధ్య కాలంలో హిట్ అయిన
సినిమా ఏ భాషలోనిదైనా
బాలీవుడ్ లో కూడా
రీమేక్ అవడం మనం చూస్తున్నాము. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క
హీరో కూడా ఈ
రీమేక్ సినిమాలపై ఆసక్తి చూపెడుతున్నారు. ఆ విధంగా తెలుగులో తెరకెక్కిన
అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో
రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు
హీరో షాహిద్ కపూర్. అలాగే ఆ
సినిమా తర్వాత ఆయన ఇప్పుడు
నాని హీరోగా నటించిన
జెర్సీ సినిమాను అదే పేరుతో
రీమేక్ చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ఆయన
ట్విట్టర్ లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. నాని గురించి ఒక్క మాటలో చెప్పమని అభిమాని అడిగితే
జెర్సీ సినిమాలో
నాని అద్భుతంగా నటించాడు. తన నటన తో నన్ను ఏడిపించేసాడు. ఈ
సినిమా చేయడానికి ముఖ్య కారణం ఆయనే అని బదులు చెప్పి తెలుగువారి హృదయాలను దోచుకున్నాడు. ఇకపోతే ఈ చిత్రానికి
గౌతమ్ తిన్న నూరి దర్శకత్వం వహిస్తుండగా తెలుగు వర్షన్ కి ఇప్పటికే రెండు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. హిందీ లో
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ
సినిమా తో
బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు ఉన్నాడు
దిల్ రాజు.