మాస్ మహారాజా రవితేజ కెరియర్లో బాగా చెప్పుకోదగిన హిట్ సినిమాలలో 'విక్రమార్కుడు' సినిమా ఒకటిగా ఖచ్చితంగా కనిపిస్తుంది.ఇక మాస్ మహారాజ్ గా రవితేజను ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా నిలబెట్టడంలో ఈ సినిమా కీలక పాత్ర కూడా ప్రధానమైనదే అని చెప్పాలి.ఇక స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ రచించిన ఈ కథకు రాజమౌళి తన దైన శైలిలో దృశ్య రూపం ఇచ్చాడు.ఇక రవితేజ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం కూడా చేశాడు. ఇక ఆ తరువాత కూడా రవితేజ ద్విపాత్రాభినయం ఇంకా త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ 'విక్రమార్కుడు' సినిమా లెక్క మాత్రం వేరు. ఇక ఈ సినిమాలోని రెండు పాత్రల మధ్య గల వైవిధ్యం థియేటర్ లో ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తుందనే చెప్పాలి.. ఇక ఎమోషనల్ సన్నివేశాలు కన్నీళ్లు పెట్టిస్తుంది.ఇక రవితేజ సరసన నాయికగా అనుష్క నటించిన ఈ సినిమా 2006లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది.

ఇక ఈ సినిమాకి వెంటనే సీక్వెల్ కూడా చేయాలని అప్పుడు అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన అది అసలు కుదరలేదు. ఇక ఆ సినిమాకి సీక్వెల్ చేయాలని ఒక పెద్ద నిర్మాత కూడా భావించడంతో ఆ సీక్వెల్ కి విజయేంద్ర ప్రసాద్ కథను కూడా రాశారు. అయితే ఈ సినిమా రాజమౌళి చేసే అవకాశం లేనే లేదు .. ఎందుకంటే ఇప్పట్లో ఆయనకు అసలు ఖాళీ లేదు. ఇక నిర్మాత రవితేజ తో 'బెంగాల్ టైగర్' సినిమా తీసిన సంపత్ నంది దర్శకత్వంలో 'విక్రమార్కుడు 2' చేయడానికి ప్రయత్నాలు మొదలెట్టాడని ఇండస్ట్రీ వర్గాల్లో బాగా గట్టిగానే చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాని సంపత్ నంది రాజమౌళి రేంజిలో తెరకేక్కిస్తాడో ఒక వేళ ఆ రేంజిలో తెరకేక్కినా కాని ఈ సినిమా విక్రమార్కుడు అంత పెద్ద హిట్ అవుతుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: