సినిమా హిట్ అవ్వాలన్న..మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవాలన్న..మొత్తం హీరో హీరోయిన్ ల చేతుల్లోనే ఉంటుంది. హీరోలకి సిక్స్ ప్యాక్ ఎంత ముఖ్యమో..హీరోయిన్ లకు ఫిజిక్ అంతే ముఖ్యం. హీరోయిన్స్ అందంగా నాజూకుగా కనిపించకపోతే..ప్రేక్షకులు కాదు కదా అసలు డైరెక్టర్స్,ప్రోడ్యూసర్స్ వాళ్లను పట్టించుకోరు. అందుకే కాబోలు పాపం హీరోయిన్స్ తమ ఫిజిక్ ని కాపాడుకోవడానికి నానాతంటాలు పడుతుంటారు.

 ఒక్కో విధంగా యోగా అని,జిం అని,వర్క్ అవుట్స్ అని బాడీ కి బాగా పనులు చెప్పుతారు. ఇక ఫుడ్ విషయంలో అయితే కడుపు నిండా తింటే ఎక్కడ లావు అయిపోతామో అన్న భయంతో కడుపు మాడ్చుకుని..నోరు కట్టేసుకుని..సినిమాలు కోసం రకరకాల డైటింగ్ లు చేస్తుంటారు. ఓకే ..ఇంత వరకు బాగానే ఉంది. అవకాశాలు ఉన్నంత వరకు తెర మీద అందంగా సన్నగా కనిపిస్తారు. ఆ తరువాత అవకాశాలు తగ్గినా..లేదా పెళ్లి చేసుకుని పిల్లలను కన్న తరువాతైనా..వీళ్లు లావు వచ్చేస్తారు. అది సహజం. కానీ, ఆ తరువాత వాళ్లు తమ బాడీ పై శ్రద్ధ పెడితేనే మళ్లీ మంచి లుక్ లోకి వస్తారు..లేదు కాదు అనుకుంటే.. వాళ్లు బాగా లావు వచ్చేస్తారు.

ఇలా నిన్నటి తరం హీరోయిన్ లను మనం చాలామందినే చూశాం. ముఖ్యంగా కన్నడ భామ రక్షితలో వచ్చిన మార్పు అందరూ కళ్లారా చూశారు.ఇప్పుడు అదే కొవాలో తెలుగు ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోయిన ఓ స్టార్ హీరోయిన్ షాకింగ్ అవతారంతో జనాల ముందుకు వచ్చి షాక్ గురి చేసింది. ప్రేక్షకులు కాదు కదా ఆమెతో సినిమా చేసిన మెగాస్టార్ చిరంజీవినే గుర్తుపట్టలేకపోయారు. అంతలా మారిపోయింది ఆ హీరోయిన్. ఆమే.. రవళి. అప్పట్లో కథానాయికగా మంచి ఊపులో ఉన్న ఆమె.. చాలా మంది ఫేవరట్ హీరోయిన్. తర్వాత ఆమె ఎక్కడుందో ఏమైందో ఎవరికీ తెలియనే లేదు.ఇప్పుడు అంటే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత  రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ‘పెళ్ళిసంద-డి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తళుక్కుమన్న ఆమె షాకింగ్ లుక్‌లో కనిపించింది. బాగా లావైపోయి గుర్తుపట్టలేకుండా పోయినా ఆమెను.. ఈమేనా రవళి అనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: