ఇదీ 2015 నాటి ముచ్చట. తెలుగులో శ్రీ మంతుడు సినిమా రిలీజ్ అయిన సందర్భం. కొరటాల శివ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించగా,  నటుడు మహేష్ బాబు హీరో నటించారు. ఆ చిత్ర కథ అందరికీ గుర్తుండే ఉంటుంది.  డబ్బున్న మహరాజు ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడం ఆధారం  ఆ సినిమా  రూపుదిద్దుకుంది.  ఈ స్పూర్తితో చాలా మంది గ్రామాల దత్తతకు ముందుకు వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కూడా  ఈ నే పథ్యంలో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
 గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అరంభించాలని తలంచింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల  చంద్ర శేఖర్ రావు ఈ కార్యక్రమానికి  వరంగల్ జిల్లా లో అరంభించాలని తలంచారు. ఆ మేరకు చర్యలుతీసున్నారు.  ఆగస్టులో ఈ కార్యక్రమం ఆరంభమైంది. అంతకు కొద్ది  నెలల ముందే ఈ కార్యక్రమానికి రూప కల్పన చేశారాయన. దీని విధి విధానాలుఎలా ఉండాలి, కార్యక్రమాన్ని ఎలా సమర్థవంతంగా అమలుచేయాలన్న విషయం పై మంత్రి వర్గ సహచరులు, అధికార యంత్రాగంతో  సుదీర్ఘ కాలం పాటు చర్చలు జరిపారు తరువాత వరంగల్ లో ఈ కార్యక్రమం లాంచనంగా ఆరంభమైంది తెలంగాణ ప్రభుత్వంలో అప్పటి  ఐటి శాఖ మంత్రి  కె.టి. రామారావు. ఆయనకు , సినీ నటుడు మహేష్ బాబుకు మంచి స్నేహితం ఉంది. కెటి రామరావు పిలుపు మేరకు  మహేష్ బాబు తెలంగాణ లోని ఓగ్రామాన్ని దత్తత తీసుకున్నారు.  అదే సిద్ధాపూర్ ... మహబూబ్ నగర్ జిల్లా లోని మారుమూల గ్రామం. దత్తత తీసుకోవడం తోనే ఆయన ఆగి పోలేదు. గ్రామాన్ని పలుమార్లు సందర్శించారు. ఎక్కడా మీడియా కంట పడలేదు. ప్రచార పర్వానికి దూరంగా ఉన్నారు. గ్రామంలో కల్పించాల్సిన మౌలిక సదుపాయలపై అధికారులతో తన ప్రతినిధి  బృందం ద్వారా చర్చలు జరిపారు. దాదాపు అంగన్ వాడీ కేంద్రం, పాఠశాల భవనాలను నిర్మించారు. అంతటితో ఆగి పోలేదాయన. తన భార్య, మాజీ సినీ నటి నమ్రాతా సిరోథ్కర్  ను అక్కడి ప్రజల బాగోగులు చూడాలని కోరారు. ఆమె  సిద్దాపూర్ లో  హీల్ ఏ చైల్డ్ పేరుతో వైద్య శిబిరాలు క్రమం తప్పకుండా నిర్వహీస్తున్నారుయ  కరోనా మహమ్మారి పడగ విప్పిన సమయంలోనూ మహష్ బాబు కుటుంబం చాలా సేవా కార్యక్రమాలు చేసింది.   కరోనా మహమ్మారిని ఎదుర్కోనేందుకు సిద్ధాపూర్ గ్రామంలో నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ చేయించారు మహేష్ బాబు.
అదే విధంగా తన తండ్రి , సినీ నటుడు కృష్ణ జన్మ స్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా బుర్రిపాళెం. కృష్ణకు బుర్రిపాళెం బుల్లోడని కూడా పేరు. ఆ గ్రామాన్ని కూడా మహేష్ బాబు దత్తత తీసుకున్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.  నమ్మతా శిరోథ్కర్  గతంలో ఒక సారి  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సతీమణి భారతీ రెడ్డితో సమావేశమయ్యారు. బుర్రిపాళెం లో తమ కుటుంబం చేపడుతున్న సేవాకార్యక్రమాలను వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: