సినిమాలకు నిర్మాతగా మారడానికి కొంతమంది మన తెలుగు హీరోలు ఈ మధ్యకాలంలో గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో దర్శకులు కూడా వారి తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు అనేది అర్థం అవుతున్న విషయం. కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి కాస్త అందరిలో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో స్టార్ హీరోలు పెట్టుబడులకు సంబంధించి కాస్త ఆసక్తి చూపించటం గమనార్హం. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ అలాగే మహేష్ బాబు కొన్ని విషయాల్లో ముందుకు వెళ్లడానికి సంబంధించి అందులో కూడా ఒక రకమైన ఆసక్తి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ నిర్మాతగా మారారని దాదాపు ఏడాది నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

అన్నయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి ఆయన కచ్చితంగా ఒక నిర్మాణ సంస్థను స్థాపించి అవకాశం ఉందని దీనికి సంబంధించి బాధ్యతలలో భార్యకు అప్పగించే అవకాశాలు ఉండొచ్చని ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి పేరు కూడా ఫైనల్ చేశారని ప్రచారం జరిగినా అది తర్వాత నిజం కాదని తెలిసింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఈ ఆలోచనకు సంబంధించి వెనక్కి తగ్గారని సినిమాల్లో నిర్మాతగా ప్రస్తుత పరిస్థితులు బాగా లేదు కాబట్టి ముందుకు వెళ్లకుండా ఉండటం మంచిది అని ఆయన ఆలోచిస్తున్నారని అంటున్నారు.

నిర్మాణ సంస్థను స్థాపించి అంశానికి సంబంధించి గతంలో కొంతమంది ప్రముఖ నిర్మాతలతో అలాగే సన్నిహితంగా ఉండే స్టార్ హీరోలతో మాట్లాడిన ఆయన ఇప్పుడు మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించి ఈ విషయంలో వెనక్కు తగ్గారు అని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాల్లో పెట్టుబడి పెట్టడం అంత మంచిది కాదు అనే భావన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారని అందుకనే వెనక్కు తగ్గారు అని అంటున్నారు. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆలోచించే అవకాశం కూడా లేదు అనే మాట కాస్త గట్టిగానే వినపడుతోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ బిజీగా గడుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: