కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోగా అజిత్ దూసుకుపోతున్నాడు. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే అజిత్ కి తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఇక ఆయన నటించిన సినిమాలు తమిళంలో చాలా ఈజీగా 100కోట్లు పైగా కలెక్షన్స్ తో సునామీ సృష్టించడం రెగ్యులర్ గా మనం వింటూనే ఉన్నాం. అయితే అతడికి తమిళంలో తప్ప తెలుగు ఇంకా ఇతర భాషల్లో అంతగా మార్కెట్ లేదా?కోలీవుడ్ టాప్ హీరో అజిత్ రేంజ్ మన టాలీవుడ్ లో అసలు 5 కోట్ల కంటే మించడం లేదా? అంటే అవుననే టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.అజిత్ కేవలం కోలీవుడ్ లో మాత్రమే పెద్ద స్టార్ హీరో అని మిగతా భాషల్లో మాత్రం అతను కేవలం ఇంటికాడ (తమిళంలో) పులి మాత్రమే అని అనేక రకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక తల అజిత్ కుమార్ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా క్రేజీ మూవీ `వలీమై` సినిమా తెలుగు రైట్స్ కి కేవలం 5కోట్లు వెచ్చించారని సమాచారం తెలిసింది. కాని తెలుగులో అజిత్ కి వున్న మార్కెట్ తో పోలిస్తే ఇది అజిత్ కి పెద్ద రేటు ..ఇక ఆ మొత్తాన్ని తిరిగి వెనక్కి తేవడం అజిత్ కి అంత సులువేమీ కాదని కూడా ట్రేడ్ విశ్లేషించడం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది.అయితే దీనికి కారణం లేకపోలేదు.. ప్రస్తుతం ఉన్న ఒమిక్రాన్ పరిణామంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల సమస్య కూడా ఒక పెద్ద కారణం అని చెప్పాలి. నిజానికి అజిత్ కుమార్ ఇతర తమిళ హీరోలతో పోటీపడుతూ వరుస హిట్లు అందుకుంటున్నా అది కేవలం తమిళం వరకే పరిమితం. తెలుగు బాక్సాఫీస్ వద్ద అజిత్ ఇటీవల అంతగా రాణించడం లేదు. అయితే వలీమై సినిమాతో దానిని తిరగరాస్తాడనే అందరూ భావిస్తున్నారు. దురదృష్ట వశాత్తూ ఈ సంక్రాంతి పండుగ రేసునుంచి అజిత్ వలీమై తప్పుకుంది.ఇక ఈ సినిమా తిరిగి ఎప్పుడు రిలీజవుతుందో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: