హీరోయిన్ గ‌జాలా గుర్తుండే ఉంటుంది. శ్రీకాంత్, రాజా హీరోలుగా 2002లో వ‌చ్చిన `ఓ చినదాన` సినిమాతో తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గ‌జాలా.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో తొలిసారి తెర‌కెక్కిన‌ `స్టూడెంట్ నంబర్ 1` మూవీలో హీరోయిన్‌గా న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత బి.గోపాల్ రూపొందించిన `అల్లరి రాముడు` మూవీలోనూ ఎన్టీఆర్‌తో ఆడి పాడిన ఈ బ్యూటీ.. ఫూల్స్, తొట్టి గ్యాంగ్, భద్రాద్రి, కలుసు కోవాలని, జానకి వెడ్స్ శ్రీరామ్ ఇలా ప‌లు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ టాలీవుడ్‌లో ఎక్కువ కాలం నిల‌దొక్కుకోలేక‌పోయింది.
అందుకు కార‌ణం గ‌జాలా ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డ‌మే. మంచి మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్న త‌రుణంలో గ‌జాలా.. హైదరాబాదులోని బంజారా హిల్స్ లో ప్రశాంత్ కుటీర్ అనే హోట‌ల్ రూమ్‌లో నిద్ర మాత్రలు మింగి సూసైడ్ ఎటెంప్ట్‌ చేసింది. ఆ స‌మ‌యంలో సహ నటులు సుల్తానా, అర్జున్ సరైన సమయానికి గుర్తించి గ‌జాలాను హుఠా హుఠిన నిమ్స్ ఆసుపత్రికి తరలించ‌గా.. చికిత్స అనంత‌రం ప్రాణా పాయం నుంచి గ‌జాలా బ‌య‌ట ప‌డింది. అయితే గజాలా సూసైడ్ ఎటెంప్ట్‌కి ఎందుకు ప్రయత్నించింది అన్న దానికి స‌రైన రీజ‌న్ తెలీక పోయినా.. ఓ హీరోతో ల‌వ్ బ్రేక‌ప్ అవ్వ‌డ‌మే కార‌ణం అంటూ అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది.
ఏదేమైన‌ప్ప‌టికీ ఈ ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత గ‌జాలా పెద్ద‌గా సినిమాల్లో క‌నిపించ లేదు. ప‌లు ఆఫ‌ర్లు వ‌చ్చినా గ‌జాలా రిజెక్ట్ చేయ‌డంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమెను ప‌ట్టించుకోవ‌డం మానేశారు. ఇక సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మైన గ‌జాలా.. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లి పోయింది. అక్క‌డ టీవీ న‌టుడు ఫైసల్ రజా ఖాన్ ను ప్రేమించి 2016 సంవత్సరంలో పెద్ద‌ల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకుంది. ప్ర‌స్తుతం భ‌ర్త‌తో ముంబైలోనే సెటిల్ అయిన గ‌జాలా.. ఫ్యూచ‌ర్‌లో ఏమైనా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందేమో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: