సూపర్ స్టార్ కృష్ణ , ఇందిరాదేవి దంపతులకు జన్మించిన మొదటి సంతానం రమేష్ బాబు.. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోదరుడు.. అయితే తాజాగా ఈయన మరణించడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఘట్టమనేని వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి బాలనటుడిగా రమేష్ బాబు అడుగు పెట్టిన విషయం తెలిసిందే. హీరోగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతూ స్వర్గస్తులయ్యారు.. ఇక ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీలో ఉండే పలువురు సీనియర్ నటులు సంతాపం వ్యక్తం చేయడం గమనార్హం..ఈ నేపథ్యంలో ని మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా రమేష్ బాబు మరణం పై ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆయన ట్విట్టర్ ఖాతా ద్వారా.. రమేష్ బాబు మరణ వార్త వినగానే నేను చాలా షాక్ అయ్యాను.. ఆయన మరణం నాకు ఎంతో బాధ కలిగించింది.. మహేష్ కి కృష్ణ గారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను.. ఈ బాధాకరమైన పరిస్థితుల నుంచి కోలుకునేలా ఆ భగవంతుడు ఈ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.. ఇక ఆయన మరణం సినీ ఇండస్ట్రీ జీర్ణించుకోలేనిది అంటూ తెలిపారు చిరంజీవి..సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద అబ్బాయి రమేష్ బాబు తన తండ్రి బాటలోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టి చరిత్రలో నిలిచిపోయే చిత్రం గా గుర్తింపు తెచ్చుకున్న అల్లూరి సీతారామరాజు సినిమాలో యువ అల్లూరి గా సినీ రంగ ప్రవేశం చేశారు..మధుసూదన్ రావు దర్శకత్వంలో వచ్చిన సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయమైన ఈయన మొత్తంగా 17 సినిమాలలో నటించారు. చివరిసారిగా ఎన్కౌంటర్ సినిమాలో తండ్రితో కలిసి నటించిన రమేష్ బాబు నటనకు స్వస్తి పలికి నిర్మాతగా మారారు. తండ్రి పేరు మీదుగా కృష్ణ ప్రొడక్షన్స్ హౌస్ ను ఏర్పాటు చేసి దూకుడు ,ఆగడు చిత్రాలకి సమర్పకుడిగా అతడు, అతిధి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: