స్వీటీ అనుష్క ప్రస్తుతం సినిమాల విషయంలో చాలా ఆలోచనలో ఉంది. అమ్మడు చేస్తానంటే చాలు కానీ అరడజను సినిమాలు అవకాశం ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. కానీ అనుష్క మాత్రం ఈమధ్య చాలా గ్యాప్ ఇచ్చింది. భాగమతి తవాత నిశ్శబ్ధం చేసిన అనుష్కసినిమా తర్వాత మళ్లీ కొద్దిపాటి గ్యాప్ తో నవీన్ పొలిశెట్టితో సినిమా ఫిక్స్ చేసుకుంది. యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా వెరైటీ కథతో వస్తుందని తెలుస్తుంది

ఇదిలాఉంటే ఈ సినిమాతో పాటుగా మెగాస్టార్ చిరంజీవితో కూడా ఓ సినిమా చేస్తుందట అనుష్క. చిరంజీవి, వెంకీ కుడుముల కాంబో సినిమాలో హీరోయిన్ గా అనుష్కకి ఛాన్స్ ఇచ్చినట్టు టాక్. అంతకుముందు స్టాలిన్ సినిమాలో అనుష్క ఓ స్పెషల్ సాంగ్ చేసింది. అనుష్కతో చిరు చేస్తున్న సినిమా ఇదే అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలని లైన్ లో పెట్టాడు. ఆచార్య పూర్తి కాగా గాడ్ ఫాదర్, భోళా శంకర్, కె.ఎస్ రవీంద్ర సినిమాలు వస్తున్నాయి.

ఈ సినిమాల తర్వాత వెంకీ కుడుముల డైరక్షన్ లో మూవీ ఉంటుంది. ఈ సినిమాను ఆర్.ఆర్.ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మిస్తున్నారు. నవీన్ పొలిశెట్టితో పాటుగా చిరుతో కూడా సినిమా చేస్తున్న అనుష్క ఇక మీదట కెరియర్ కు గ్యాప్ ఇవ్వకుండా చేస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా అనుష్క మళ్లీ సినిమాలు చేయడం ఆమె ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అనుష్క చేస్తున్న ఈ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి. ఇదేకాదు ఇకమీదట వరుస సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యిందత జేజమ్మ. ఈ సినిమాలతో పాటు మరో ఫీమేల్ సెంట్రిక్ సినిమా కూడా డిస్కషన్స్ లో ఉందని తెలుస్తుంది. సో మొత్తానికి స్వీటీ ఫ్యాన్స్ అంతా మళ్లీ హంగామా చేసేలా ఈ సినిమాలు ఉండబోతున్నాయి. అయితే కథల విషయంలో మాత్రం అమ్మడు రాజీ పడట్లేదని తెలుస్తుంది. మనసుకి నచ్చిన కథల కోసమే ఇన్నాళ్లు వెయిట్ చేసినట్టు టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: