సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన సుధీర్ బాబు ఇప్పుడిప్పుడే ఒక సరైన ట్రాక్ లోకి వచ్చాడని చెప్పొచ్చు. వి సినిమాతో సుధీర్ బాబు క్రేజ్ పెరిగింది. ఆ సినిమాలో అతని పర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించింది. సినిమాలో అతను చేసిన పాత్రకు న్యాయం చేశాడు. ఇక ఇదిలాఉంటే సుధీర్ బాబు ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమాతో పాటుగా నటుడు, రచయిత హర్షవర్ధన్ డైరక్షన్ లో సుధీర్ బాబు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ లో నారాయణ దాస్ నారంగ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈమధ్యనే మొదలైంది. సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించారు. ఈ సినిమాలో సుధీర్ బాబు లుక్ చాలా కొత్తగా ఉంటుందని. అతని క్యారక్టరైజేషన్ స్పెషల్ గా ఉంటుందని చెబుతున్నారు.

కెరియర్ లో ఓ సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సుధీర్ బాబు తన శ్రీదేవి సోడా సెంటర్ టార్గెట్ రీచ్ అవుతుందని అనుకున్నా పెద్దగా వర్క్ అవుట్ అవలేదు. అయితే రాబోతున్న రెండు సినిమాలు మాత్రం క్రేజీగా ఉంటాయని తెలుస్తుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాతో పాటుగా హర్షవర్ధన్ సినిమా కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు. సుధీర్ బాబు 15వ సినిమాగా వస్తున్న హర్షవర్ధన్ డైరక్షన్ లో మూవీ ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. సుధీర్ బాబు మాత్రం ఈ రెండు సినిమాల మీద చాలా నమ్మకంగా ఉన్నాడని తెలుస్తుంది. ఈ రెండితో రెండు సూపర్ హిట్లు టార్గెట్ పెట్టుకున్నాడు ఈ డ్యాషింగ్ హీరో.


మరింత సమాచారం తెలుసుకోండి: