
ఇక మరొక తమిళ స్టార్ హీరో సూర్య ఓటీటీ సినిమాలు సూరరైపొట్రు, జైభీమ్‌తో బ్యాక్ టూ బ్యాక్ హిట్‌లు సాధించాడు. ఇప్పుడు తరువాత సినిమా ఎతర్కుం తనింధవన్ తో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సూర్య. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రములో సూర్యకు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటించారు. సన్ పిక్ఛర్స్ నిర్మిస్తున్న తమిళ చిత్రం తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్నది. ఈ యాక్షన్ డ్రామా మార్చి 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవ్వనుందని మేకర్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. 'ఈటీ' విడుదల అయిన తరువాత రోజునే ప్రభాస్ రాధేశ్యామ్ కూడా మార్చి 11న విడుదల అవుతుందని చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పుడు సూర్య 'ఈటీ', ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమాల మధ్య రసవత్తమై పోటీ నెలకొందని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి తమిళ స్టార్ హీరో సూర్య ఉత్తర భారత్‌లో పాన్ ఇండియా రేసులో ఇంకా అడుగు పెట్టలేదు. కానీ ఆయన ఈ సినిమాతో ఆయన అక్కడ అదృష్టం పరిక్షించుకోనున్నారు. స్ట్రాంగ్ కంటెంట్ ఉండే సినిమాలతో ప్రేక్షకులను అలరించే సూర్యకు కోలీవుడ్‌లో భారీ క్రేజ్ ఉన్నది. ఈయనకు తెలుగులో కూడా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్నది. సూర్య నటించిన చాలా సినిమాలు టాలీవుడ్‌లో హిట్ అయిన విషయం తెలిసినదే. ప్రభాస్‌కు టాలీవుడ్‌లో తిరుగు లేనప్పటికీ.. సూర్య వల్ల ఇండియా లేవల్‌లో మాత్రం కాస్త ఇబ్బందే అవుతుందని టాక్ వినిపిస్తోంది. మరీ సూర్య 'ఈటీ', ప్రభాస్ రాధేశ్యామ్‌లో విజయం ఎవరినీ వరిస్తుందో తెలియాలంటే సినిమాలు విడుదలయ్యే వరకు వేచి చూడాలి మరీ.