
ఓ విధంగా చెప్పాలంటే తన టాలీవుడ్ ఆశలన్ని హరి హర వీరమల్లు సినిమా మీదే పెట్టుకుంది నిధి అగర్వాల్. చేతిలో ఉన్నది ఆ ఒక్క సినిమానే ఇకపోతే అమ్మడి ఒకటి రెండు సినిమాలు చర్చల దశల్లో ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఖాళీగా ఉండి ఏం చేస్తానని ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేస్తుంది నిధి అగర్వాల్. లేటెస్ట్ గా వైట్ టాప్ తో తన వయ్యారాలతో అలరిస్తుంది నిధి అగర్వాల్.
వచ్చిన ప్రతి సినిమా అవకాశాన్ని చేయకుండా ఆచి తూచి కెరియర్ ప్లాన్ చేస్తున్న నిధి అగర్వాల్ ఈ పాటికి అరడజను సినిమాలు చేయాల్సి ఉన్నా మధ్యలో కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడ బిజీ హీరోయిన్ అయ్యింది. ఇక ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ మొత్తం తెలుగు పరిశ్రమ మీద పెట్టిన నిధి అగర్వాల్ ఇక్కడ సరైన ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లో నిధి అగర్వాల్ ఒకరు. తప్పకుండా అమ్మడికి లక్కీ ఛాన్సులు వస్తాయని చెప్పొచ్చు. మరి అమ్మడికి తెలుగులో అలాంటి ఛాన్సులు వస్తాయా లేదా అన్నది చూడాలి.