కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన శివ కార్తికేయన్ తాజాగా సీబీ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన డాన్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శివ కార్తికేయన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించింది. 

మూవీ లో సముద్ర ఖని , ఎస్ జే సూర్య ముఖ్య పాత్రలో నటించారు.  ఈ మూవీ ని తెలుగు లో కాలేజ్ డాన్ పేరుతో విడుదల చేశారు. తెలుగు లో ఎలాంటి హడావుడి లేకుండా ఈ మూవీ ని విడుదల చేసినప్పటికీ ఈ మూవీ కి  తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ లభించడంతో ఈ మూవీ టాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. అలాగే ఈ సినిమా తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం సాధించింది.  ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండి ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన , నేట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.  ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ రావడం మరియు మంచి విజయం సాధించడంతో ఈ మూవీ కి 'ఓ టి టి' లో కూడా మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ వారం నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి'  ప్లాట్ ఫామ్ తమ 'ఓ టి టి' లో ఈ వారం టాప్ 10 లో నిలిచిన మూవీ ల లిస్ట్ ను విడుదల చేసింది. అందులో శివ కార్తికేయన్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సీబీ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన డాన్ మూవీ మొదటి స్థానంలో నిలిచింది. ఇలా థియేటర్ లలో ప్రేక్షకులను ఎంత గానో అలరించి మంచి విజయం సాధించిన డాన్ మూవీ ప్రస్తుతం 'ఓ టి టి' ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో అలరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: