కే జి ఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది నిర్మాణ సంస్థ హోం బలే. దేశవ్యాప్తంగా ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు ఎంతో ఫేమస్ అయిపోయింది అని చెప్పాలి. అంతటి భారీ బడ్జెట్ సినిమా చేయడం మాత్రమే కాకుండా దానికి అంతటి స్థాయిలో విజయాన్ని చేకూర్చడం ఈ సంస్థ వల్లే అయింది. అందుకే ఈ నిర్మాణ సంస్థకి ఇంతటి క్రేజ్ ఉంది. దేశంలోని పలు భాషల అగ్ర హీరోలు అందరూ కూడా ఈ సంస్థలో సినిమాలు చేయాలని భావిస్తున్నారు. ఆ విధంగా ఈ నిర్మాణ సంస్థ కూడా భాషతో సంబంధం లేకుండా అక్కడి అగ్ర హీరోలతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతుంది.

ఇప్పటికే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించడం ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆసక్తి పరుస్తుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత కూడా వారు భారీ సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా సూర్య దుల్కర్ సల్మాన్ నాని లతో కలిసి  సినిమాలు చేసే విధంగా అడుగులు వేస్తుంది హోమ్ బలే. 

ఇది ఎప్పుడు మొదలవుతుంది అన్న విషయాలపై క్లారిటీ లేదు గాని ఈ సినిమా ను తప్పకుండా భారీ సినిమాలు చేసే విధంగా వారు చేస్తున్నారు. ఈ హీరోలతో అగ్ర దర్శకుడే సినిమా చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే వీరి ముగ్గురితో కలిసి ఒక సినిమానా లేదా ముగ్గురితో విడివిడి సినిమాల అన్న క్లారిటీ ఇంకా రాలేదు. సుధా కొంగర దర్శకత్వంలో ఈ చిత్రం చేయబోతున్నారని అంటున్నారు. నాలుగు భాషలను టార్గెట్ చేస్తూ భారీ సినిమా చేసే విధంగా వీరు పని చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. కే జి ఎఫ్ లాంటి భారీ చిత్రాన్ని చేసిన తర్వాత మీరు ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమాను తొందరలోనే మొదలుపెట్టబోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

KGF