తమిళనాడు తో పాటు తెలుగు నాట కూడా భారీ స్థాయిలో క్రేజ్ ను దక్కించుకున్నాడు సూర్య. చాలామంది అభిమానులను కలిగి ఉన్న సూర్య డైరెక్ట్ గా ఓ తెలుగు సినిమా చేయాలనే డిమాండ్ కూడా ఎప్పటినుంచో ఉంది. ఆ విధంగా ఇప్పుడు తెలుగు సినిమాలను చేస్తున్న పలువురు కోలీవుడ్ హీరోల జాబితాలో ఈ హీరో కూడా చేరడం ఆయన అభిమానులను ఎంతగానో ఆనందపరుస్తుంది.  ఇప్పటికే తమిళ స్టార్ హీరో ధనుష్ అలాగే శివ కార్తికేయన్ లు తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేస్తున్నారు.

ఆ విధంగా ఇప్పుడు వారి సరసన చేరిన సూర్య ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించడం ఖాయం అనే చెప్పాలి. మరొక స్టార్ హీరో విజయ్ కూడా తెలుగులో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా వంశీ పైడిపల్లి దర్శకత్వం చేస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్య స్టార్ హీరో స్థాయిలో మార్కెట్ ను క్రియేట్ చేసుకోగా ఇప్పుడు ఆయన డైరెక్ట్ట్గా  ఆసినిమా చేయడం విశేషం. 

గతంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఆయన సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ అది చర్చల దశలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఆయన కొన్ని కథలు విన్నా కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు తాజాగా దర్శకుడు శివ ఈ హీరోకి ఓ కథ చెప్పగా అది మంచి పాత్రతో కూడిన యాక్షన్ మసాలా సినిమాగా భావించి సూర్య తెలుగులో ఈ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.  ప్రస్తుతం సూర్య బాలా దర్శకత్వంలో అచలుడు అనే సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ కూడా విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: