తెలుగు సినిమా ఇండస్ట్రీ లో యువ హీరోలలో ఒకరి అయినటు వంటి సుమంత్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుమంత్ అశ్విన్ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించు కున్నాడు. ఇది ఇలా ఉంటే సుమంత్ అశ్విన్ కెరియర్ ల్ కేరింత మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని ఈ హీరో కు కూడా మంచి గుర్తింపు ను తీసుకు వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా సుమంత్ అశ్విన్ '7 డేస్ 6 నైట్స్' అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. 

మూవీ లో సుమంత్ అశ్విన్ తో పాటు మెహర్ చహల్ , రోహన్ , కేతిక శెట్టి లు కూడా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ కి ఎమ్ ఎస్ రాజు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని జూన్ 24 వ తేదీన థియేటర్ లలో విడుదల చేశారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయిన 7 డేస్ 6 నైట్స్ మూవీ మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి రాబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వచ్చేసింది. 7 డేస్ 6 నైట్స్ మూవీ ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటు వంటి ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో సెప్టెంబర్ 9 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: