టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడిగా ఇంకా అలాగే రాజకీయవేత్తగా అంతకంటే గొప్ప మనసున్న మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. తను నటనతో రెబల్ స్టార్ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కృష్ణంరాజు మృతితో నేడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మొత్తం విషాదంలో మునిగిపోయింది.కృష్ణంరాజు దాదాపు 50 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమ లోనే తన జీవితాన్ని కొనసాగించారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా , హీరోగా ఎన్నో చిత్రాలలో నటించిన ఈయన తన సినిమాలతో ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకోవడం అంటే అది ఒక అద్భుతమైన ఘట్టం అని చెప్పాలి.1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు లోని ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు.. లక్ష్మీదేవి దంపతులకు జన్మించారు. ఇక వీరిది రాజుల కుటుంబం.. కృష్ణంరాజుకి వారసత్వంగా మొగల్తూరులో కొన్ని వందల ఎకరాల భూమి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆ భూమి నిర్వహణ మొత్తం మొగల్తూరులో ఉన్న కృష్ణంరాజు బంధువులే చూసుకుంటున్నట్లు అక్కడివారు స్పష్టం చేశారు.


ఇకపోతే మొగల్తూరులో ఈయనకు ఒక భవనం కూడా ఉందట. ఈయనకు మాత్రమే కాదు ప్రభాస్ కూడా ఇప్పుడు ఒక భవనాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆస్తుల విషయానికి వస్తే చెన్నై , హైదరాబాద్ వంటి మహానగరాలలో మొత్తం నాలుగు ఖరీదైన ఇళ్ళు కూడా ఉన్నాయి. ఇక ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్న ఇంటి ఖరీదు దాదాపు 20 కోట్ల రూపాయలు.అంతేకాదు హైదరాబాదులో కృష్ణంరాజుకు ఒక ఫామ్ హౌస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గోపీకృష్ణ నిర్మాణ సంస్థను కూడా కృష్ణంరాజు స్థాపించి ఆ సంస్థ ద్వారా ఎన్నో చిత్రాలను కూడా తెరకెక్కించారు. ఇక ఈయన దగ్గర ఉండే కారు కలెక్షన్ విషయానికి వస్తే రూ. 1 కోటి విలువైన మెర్సిడెస్ బెంజ్ కార్, రూ.40 లక్షల విలువైన టయోటా ఫార్చునర్ కారు.. తోపాటు రూ.2 కోట్ల రూపాయల విలువ చేసి మరికొన్ని కార్లు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ఈయన దగ్గర ఉన్న అంత ఆస్తి విలువ రూ.1000 కోట్ల వరకు ఉంటుంది అని సమాచారం తెలుస్తుంది. ఇదంతా కేవలం కృష్ణంరాజు ఆస్తి మాత్రమే ఇక ప్రభాస్ , ఆయన తండ్రి ఆస్తులు ఇంకా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: