యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకలలో ఒకరు అయినటు వంటి కొరటాల శివ దర్శకత్వం లో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ కి అనురుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనుండగా ,  రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా తేరకెక్కబోతుంది.

ఇప్పటికే ఈ మూవీ నుండి మూవీ యూనిట్ ఒక మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఆ మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయిన తర్వాత అతి తక్కువ కాలంలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు అప్పట్లో కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. కాక పోతే ఇప్పటివ రకు కూడా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు.

మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికి కూడా ప్రారంభం కాకపోవడానికి ప్రధాన కారణం ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయికి మించి తెరకెక్కించాలనే ఉద్దేశంతో కొరటాల శివ ఉండడంతో ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ మూవీ లో స్లిమ్ లుక్ లో కనబడటం కోసం కొన్ని కిలాల బరువు తగ్గడం కోసం కాస్త సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం గమనిస్తే జూనియర్ ఎన్టీఆర్ ,  కొరటాల శివకామినేషన్ లో తెరకెక్కబోయే మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: