టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తాజాగా ది వారియర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ది వారియర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని తన తదుపరి మూవీ ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నాడు.  ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మూవీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కబోతుంది. రామ్ పోతినేని కెరియర్ లో ఈ మూవీ 20 వ మూవీ గా తెరకెక్కబోతుంది. ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  రామ్ పోతినేని ,  బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో రామ్ పోతినేని సరసన సాక్షి వైద్య ని హీరోయిన్ గా చిత్ర బృందం ఎంపిక చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

ఈ వార్త కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువబడలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సాక్షి వైద్య ,  అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ లో అఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ముద్దు గుమ్మ ఏజెంట్ మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. ఇలా సాక్షి వైద్య నటించిన మొదటి సినిమా విడుదల కాక ముందే తెలుగు లో ఈ ముద్దు గుమ్మ కు మరో క్రేజీ సినిమా అవకాశం దక్కినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: