
తాజాగా ఈ చిత్రం నుండి 'సేనాపతి నేనే' పాటని విడుదల చేశారు. జివి ప్రకాష్ కుమార్ హుషారైన జానపద గీతంగా ఈ పాటని కంపోజ్ చేశారు. ఎనర్జిటిక్ డ్యాన్సింగ్ బీట్ స్కోర్ చేసిన ఈ పాట జనరం జకంగా అలరిస్తోంది. అనురాగ్ కులకర్ణి ఈ పాటని ఫోక్ స్టయిల్ లో ఆలపించగా.. చంద్ర బోస్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ఈ పాటలో కార్తి గెటప్ జానపద గీతానికి తగినట్లు పులి చర్మదారిగా కనిపించి ప్రత్యే కమైన నృత్య రూపకంతో అలరించారు.భారీ నిర్మాణ విలువలు వున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సర్దార్ 2022 దీపావళికి తెలుగు, తమిళంలో థియేట్రికల్ విడుదల కానుంది. అన్న పూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుం డటంతో సహజం గానే ఈ చిత్రం తెలుగు లో భారీ సంఖ్యలో గ్రాండ్ గా థియేటర్ లో విడు దలౌతుంది.