
డైరెక్ట్ చేసిన 'లవ్ టుడే' లో కథానాయికగా నటించింది. తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌ని అగ్ర నిర్మాత దిల్ రాజు అదే పేరుతో తెలుగులో విడుదల చేశాడు.. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది.. దీంతో ఇవానాకి దిల్ రాజు ఇప్పటికే తన బ్యానర్లో హీరోయిన్ అవకాశం కూడా ఇచ్చేసాడు... ఇవానా 2012లో పృథ్వీ రాజ్ సుకుమారన్ 'మాస్టర్స్' అనే మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
మూడు సినిమాల్లో కూడా బాల నటిగా నటించింది. ఆ తర్వాత 2018లో కోలీవుడ్‌లోకి వెళ్లింది. జ్యోతిక లీడ్ రోల్‌లో తెరకెక్కిన 'నాచియర్' ( తెలుగులో ఝాన్సీ) సినిమాలో కీలక పాత్ర పోషించింది. మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ జీవీ ప్రకాష్ కుమార్‌కు జోడీగా అరసి అనే పాత్రలో ఆమె జీవించేసింది. ఈ సినిమాలో ఇవానా నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. ఫిలింఫేర్, సైమా అవార్డుల కోసం నామినేట్ కూడా అయ్యింది. ఈ సినిమా తర్వాత శివ కార్తికేయన్ 'హీరో' మూవీలో ఇంపార్టెంట్ రోల్ కూడా చేసింది.
'లవ్ టుడే' తో టాలీవుడ్ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంది.. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో తమిళంతో పాటు తెలుగులో కూడా ఇవానాకు మంచి అవకాశాలు వస్తున్నాయి చూస్తుంటే ఇవానా టాలీవుడ్‌లో మరో కృతి శెట్టి అయ్యేలా ఉందని మాట్లాడుకుంటున్నారట.కృతి శెట్టి కూడా 'ఉప్పెన' తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.. పెద్ద ప్రొడ్యూసర్లతో పాటు మీడియం, లో బడ్జెట్ సినిమా నిర్మాతలు కూడా తననే అప్రోచ్ అవుతున్నారని తెలుస్తుంది...