దర్శకుడు నక్కిన త్రినాధ్ రావు ఇండస్ట్రీలోకి వచ్చి చాలకాలం అయినప్పటికీ ఇంకా టాప్ దర్శకుల లిస్టులోకి చేరలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో రవితేజాను నమ్ముకుని తీసిన ‘థమాక’ తో అతడి దశ తిరుగుతుందని చాల ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.


పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా ఈవారం క్రిస్మస్ కు రాబోతున్న మూవీ పై రవితేజా కూడ చాల ఆశలు పెట్టుకున్నాడు.ఇప్పటికే రిలీజ్ అయిన ఈమూవీ ట్రైలర్ లోని డైలాగ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ ను గుర్తుకు చేస్తున్నాయి అంటూ కామెంట్స్ వస్తూ ఉండటంతో ఈ మూవీకి క్లాస్ ప్రేక్షకులు కూడ బాగా వస్తారు అన్న అంచనాలు ఉన్నాయి.‘మనకి కావాల్సిన వాళ్లకు చేస్తే మోసం మనకి కావాలి అనుకున్నవాళ్ల కోసం చేస్తే న్యాయం" ‘ధమాక’ ట్రయిలర్ లోని ఈ డైలాగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ డైలాగ్ త్రివిక్రమ్ వ్రాసాడా అంటూ కొందరు జోక్ కూడ చేస్తున్నారు. ఈవిషయాలు నక్కిన త్రినాధ్ రావు దృష్టి వరకు వెళ్ళడంతో అతడు ఈవిషయం పై స్పందించాడు. ట్రైలర్ లోని ఈ డైలాగ్ విని త్రివిక్రమ్ తనకు స్వయంగా పోన్ చేసి అభినందించిన విషయాన్ని బయటపెడుతూ ఈ డైలాగ్ త్రివిక్రమ్ కు కూడ నచ్చింది అంటే తన సినిమా విడుదల కాకుండానే బ్లాక్ బష్టర్ హిట్ అయినట్లు అని కామెంట్ చేసాడు.


అంతేకాదు ఈ మూవీలోని మరొక డైలాగ్ బ్యాగ్రౌండ్ ఉంటేనే రాణించగలమని అనుకుంటారని కానీ బ్యాగ్రౌండ్ లేకుండా కూడా రాణించవచ్చు’ అని రవితేజ చెప్పిన డైలాగ్ అతడి వ్యక్తిగత జీవితాన్ని సూచిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘అవతార్ 2’ ఊహించిన స్థాయిలో సగటు ప్రేక్షకుడుని మెప్పించలేకపోవడంతో వెనువెంటనే మాస్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీ ఏమాత్రం బాగున్నా క్రిస్మస్ సెలవులలో కోట్లు కొల్లగొట్టుకునే మూవీగా మారే ఆస్కారం కనిపిస్తోంది. ‘క్రాక్’ తరువాత సరైన హిట్ లేక బాధ పడుతున్న రవితేజా కు ఒక సూపర్ హిట్ ఎంతో అవసరం..మరింత సమాచారం తెలుసుకోండి: