
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా తమిళంలో జయం రవి, అనిరుధ్ రవిచంద్రన్ సంయుక్తంగా విడుదల చేశారు. అలాగే మలయాళం లో క్రేజీ హీరో నవీన్ పాలీ రిలీజ్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ తో కూడా అంచనాలను మరింతగా పెంచేశారు చిత్ర బృందం. కాకపోతే ఈ సినిమాలో కాస్త హింస ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో అంచనాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా మైకెల్ ట్రైలర్ తర్వాత వస్తున్న స్పందన చూసి దర్శకుడు రంజిత్ జయ కోడి పై భారీ ఆశలు కూడా పెరుగుతున్నాయి.
ముఖ్యంగా మైకేల్ చిత్రం ఒక రిచ్ గా చిత్రీకరించబడిన యాక్షన్ త్రిల్లర్ మూవీ అన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఇందులో తుపాకీలు , ధైర్యం మరియు ప్రేమకు సంబంధించిన తీవ్రమైన భావోద్వేగాలతో కథను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అడపాదడపా సినిమాలు చేస్తూ సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్ కి ఈ సినిమా ఊరట ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు.