ఇక 'జీరో' సినిమా తర్వాత నాలుగేళ్ల విరామం తీసుకొని షారుక్ ఖాన్ చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ స్పై చిత్రం 'పఠాన్'. 'బ్యాంగ్ బ్యాంగ్' 'వార్' వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ & పాటలు బాగా హిట్ అయ్యి ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలను నెలకొల్పాయి.ఇక మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా? లేదా? ఎప్పుడో 2013 నుంచి సరైన హిట్ లేక ఢీలాపడిన షారుక్ ఖాన్ కు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ సాలిడ్ హిట్ పడిందా లేదా? అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.కథ విషయానికి వస్తే..భారతదేశంపై భారీ దాడికి ప్లాన్ చేసిన ఔట్ ఫిట్ ఎక్స్ అనే గ్యాంగ్ కి లీడర్ గా జిమ్ (జాన్ అబ్రహాం) ఉంటాడు. డైరెక్ట్ ఇండియన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ 'రా'ను అతను బాగా బెదిరిస్తాడు. ఇక కొంతకాలంగా అజ్ణాతంలో ఉన్న పఠాన్ (షారుక్ ఖాన్)కు కబురు పెడుతుంది రా టీం . జిమ్ ఇంకా అతని గ్యాంగ్ ను ఎదుర్కోవడానికి పఠాన్ ఎలాంటి రిస్క్ చేశాడు? దాడిని తప్పించడానికి అతను ఎవరి సహాయం తీసుకున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ 'పఠాన్' చిత్రం.


షారుక్ ఖాన్ దాదాపు 10 సంవత్సరాల తర్వాత  బెస్ట్ లుక్ లో కనిపించి ఎంతగానో ఆకట్టుకున్నాడు. నటుడిగా ఆయన ఏస్థాయిలో ఆకట్టుకుంటారు అనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రాజెక్ట్ చేయనక్కర్లేదు. సినిమాలో అతని స్క్రీన్ ప్రెజన్స్ ఇంకా కామెడీ టైమింగ్ ను ఆడియన్స్ భీభత్సంగా ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ . అలాగే.. యాక్షన్ సీన్స్ లో కూడా షారుక్ ప్రెజన్స్ ఫ్యాన్స్ కి పెద్ద పండగే.దీపిక పడుకొనే సెక్సీ లుక్స్ అయితే స్టన్నింగ్ గా ఉన్నాయి. ఆమె సెక్స్ అప్పీల్ ఇంకా సాంగ్స్ లో హాట్ డ్యాన్సులు మాస్  మసాలా ఆడియన్స్ కు ఫీస్ట్ లాంటివి. నెగిటివ్ రోల్లో జాన్ అబ్రహాం అయితే అదరగొట్టాడు. అశుతోష్ రాణా ఇంకా డింపుల్ కపాడియాలు తమ తమ పాత్రలకు చక్కటి న్యాయం చేశారు. ఎలివేషన్స్, BGM, సాంగ్స్, నటినటుల ప్రదర్శన అంతా పర్ఫెక్ట్.. బట్ ఒక్కటి మాత్రం లేదు. అదే అసలైన మైనస్.. అదే కథ. కథలో కొత్త దనం లేదు.. పాత కథనే డైరెక్టర్ చాలా స్టైలిష్ అండ్ పర్ఫెక్ట్ గా తీసాడు. చెప్పాలంటే డైరెక్టర్ గా ఇరగొట్టి రైటర్ గా ఫెయిల్ అయ్యాడు. కథను బాగా డిజైన్ చేసుంటే పఠాన్ కి ఇక తిరుగుండేది కాదు..

మరింత సమాచారం తెలుసుకోండి: