
అయితే జెనీలియా ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఇక ఈ అమ్మడు మాత్రం హహ హసిని అని బొమ్మరిల్లు సినిమాలోని పాత్రతోనే ప్రేక్షకుల మదికి బాగా దగ్గర అయింది అని చెప్పాలి. అయితే ఆ తర్వాత రానా సరసన నటించిన నా ఇష్టం సినిమా తర్వాత పూర్తిగా తెలుగు సినిమాలకు దూరమైంది. ఇక రితేష్ దేశ్ముక్ ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోనే బిజీ అయిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఇక ఇప్పుడు జెనీలియా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. భర్త రితేష్ దేష్ ముక్ తో కలిసి వేద్ అనే సినిమాలో నటించింది.
నాగచైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ సినిమాకు మరాఠీ రీమేక్ ఈ వేద్ సినిమా. ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఘనవిజయాన్ని సాధించి జెనీలియా నటనకు మంచి పేరు తీసుకువచ్చింది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల తన కెరీర్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జీవితంలో ఒకటి కావాలంటే ఇంకొకటి వదిలేయాలి. రెండు పడవల మీద ఎప్పుడు ప్రయాణం సాగదు. అందుకే పెళ్లయ్యాక వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించా. సినిమాలు చేస్తూ ఇంటిని చూసుకోవడం కుదరదు అని అర్థం చేసుకున్న. అందుకే సినిమాలను వదిలేసా. అలా చేయడం వల్లే ఒక మంచి ఇల్లాలుగా తన కుటుంబంలో పేరు సంపాదించుకోగలిగాను. ఇక ఇన్నేళ్ల తర్వాత ప్రేక్షకులను మళ్లీ నన్ను నటిగా ఆదరించడం ఎంతో సంతోషంగా ఉంది. తనకు నచ్చిన కథలు దొరికితే ఇంకా సినిమాలు చేస్తా అంటూ చెప్పుకొచ్చింది.