టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన జెనీలియా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. డి, రెడీ, సై వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగులో కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్గా ఉంది జెనీలియా. సాధారణంగా ఈమె పేరు చెప్తే హహ హాసిని అంటూ అమాయకంగా నవ్వే బొమ్మరిల్లు హీరోయిన్ చాలా మందికి గుర్తొస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటివరకు చాలా సినిమాలలో హీరోయిన్గా నటించిన జెనీలియా రానా సరసన నటించిన నా ఇష్టం సినిమా తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైంది .అనంతరం రితేష్ తో పెళ్లి చేసుకుంది జెనీలియా. 

పెళ్లి తర్వాత పూర్తిగా వ్యక్తిగత జీవితానికి కేటాయిస్తూ భర్త పిల్లలతో బిజీగా ఉంది జెనీలియా. ఇకపోతే ఇటీవల జెనీలియా భర్త రితేష్ తో కలిసి వేద అనే సినిమాలో నటించింది.ఇక ఈ సినిమాని తెలుగులో నాగచైతన్య మరియు సమంత కలిసి నటించిన మజిలీ సినిమాకి మరాఠీ రీమేకె  ఈ సినిమా. ఇక జెనీలియా మరియు తన భర్త ఇద్దరూ కలిసి జంటగా నటించిన సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాతో జెనీలియాకి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ  క్రమంలోని జెనీలియా మాట్లాడుతూ.. జీవితంలో ఒకటి కావాలంటే ఖచ్చితంగా మరొకటి వదిలేయాల్సి ఉంటుంది..

రెండు పడవల మీద ప్రయాణం ఒకేసారి సాగదు కదా.. పెళ్లయ్యాక వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించాల్సి వస్తుంది.. ఒకే సమయంలో సినిమాలు ఇంటి పనులు చూసుకోవడం అసలు కుదరదు.. అందుకే నేను సినిమాలు మానేశాను.. ఇక నేను సినిమాలు మానేయడం వల్లే ఇవాళ ఒక మంచి ఇల్లాలుగా నా కుటుంబంలో మంచి పేరును తెచ్చుకోగలిగాను.. ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా సొంత ప్రొడక్షన్ చేస్తున్నాను.. దాంతోపాటు మరికొన్ని వ్యాపార సంస్థలను కూడా నడిపిస్తున్నాను.. అంతేకాదు ఇన్నాళ్లు అవుతున్నప్పటికీ ప్రేక్షకులు నన్ను మళ్ళీ నటిగా కుదిరితే నేను ఇష్టపడే కథలు దొరికితే ఖచ్చితంగా మళ్ళీ సినిమాల్లో నటిస్తాను అంటూ చెప్పకు వచ్చింది జెనీలియా..!!

మరింత సమాచారం తెలుసుకోండి: